Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కృష్ణా ష్రాఫ్ పూల్ సైడ్ ట్రీట్

ప్ర‌ముఖ న‌టుడు జాకీ ష్రాఫ్ న‌ట‌వార‌సుడిగా టైగ‌ర్ ష్రాఫ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 April 2024 11:01 AM GMT
ఫోటో స్టోరి: కృష్ణా ష్రాఫ్ పూల్ సైడ్ ట్రీట్
X

ప్ర‌ముఖ న‌టుడు జాకీ ష్రాఫ్ న‌ట‌వార‌సుడిగా టైగ‌ర్ ష్రాఫ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. టైగ‌ర్ హిందీ చిత్ర‌సీమ‌లో యాక్ష‌న్ స్టార్ ఇమేజ్‌తో స‌త్తా చాటుతున్నాడు. అయితే జాకీ ష్రాఫ్ కుమ‌ర్తె కృష్ణా ష్రాఫ్ మాత్రం న‌ట‌న‌కు దూరంగా ఉంది. త‌న‌కు అవ‌కాశాలొస్తున్నా కానీ వాటిని సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని కృష్ణా చాలా సార్లు వెల్ల‌డించింది.

ఇక కృష్ణా ష్రాఫ్ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. అక్క‌డ అంద‌మైన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ త‌న‌కంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇంత‌కుముందు త‌న బోయ్ ఫ్రెండ్ ని కూడా కృష్ణా ప‌రిచ‌యం చేసింది. అతడితో రొమాంటిక్ ఫోజుల‌కు సంబంధించిన ఫోటోల‌ను కృష్ణా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఈ జంట విడిపోయిన క‌బురు కూడా అందింది. అదంతా అటుంచితే కృష్ణా ష్రాఫ్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను ఎదిగేస్తోంది. త‌న సోద‌రుడు టైగ‌ర్ తో క‌లిసి కృష్ణా సొంతంగా స్పేసియ‌స్ జిమ్ ల‌ను కూడా నిర్వ‌హిస్తోంది. ఇటీవ‌లే ఎంఎంఏ మ్యాట్రిక్స్ జిమ్ పేరుతో ఎక‌రం విస్తీర్ణంలో అదిరిపోయే జిమ్ ని ప్రారంభించింది. ఈ జిమ్ కి కోఫౌండ‌ర్ గా కృష్ణా ష్రాఫ్ కొన‌సాగుతోంది. ఫిట్ నెస్ ఫ్రీక్ గా కృష్ణా త‌న అభిరుచిని ప్ర‌తిబింబించేలా ఈ జిమ్ ని అత్యంత కాస్ట్ లీగా డిజైన్ చేయించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

మ‌రోవైపు కృష్ణ షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. కృష్ణా జిమ్ చేసిన త‌ర్వాత క‌చ్ఛితంగా స్విమ్మింగ్ చేస్తుంది. అలా స్విమ్ చేసిన త‌ర్వాత పూల్ సైడ్ సేద దీరుతున్న‌ప్ప‌టి ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. కృష్ణా ఈ ఫోటోల్లో ఎంతో క్యూట్ గా అందంగా క‌నిపిస్తోంది. కృష్ణ దేహ‌శిరుల‌ను క‌వ‌ర్ చేస్తూ ఒక అంద‌మైన ఫ్రాక్ మాత్ర‌మే త‌న ఒంటిపై ఉంది. శ‌రీరంపై అక్క‌డ‌క్క‌డా ప‌చ్చ‌బొట్టు ఎంతో తీరిగ్గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

కృష్ణ - జాకీ ష్రాఫ్ ఇద్ద‌రు ఇటీవ‌ల‌ జాకీ 67వ పుట్టినరోజును జరుపుకోవడానికి ముంబై సమీపంలోని వారి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. హీరో (1993), పరిందా (1989), సౌదాగర్ (1991), రంగీలా (1995) వంటి సినిమా హిట్‌లలో కనిపించిన జాకీ 272 సినిమాలతో సుదీర్ఘమైన ఫిల్మోగ్రఫీని క‌లిగి ఉన్నాడు. త‌న కుమార్తె మాత్రం న‌ట‌న‌లోకి రాకుండా ఫిట్‌నెస్ నిపుణురాలిగా, MMA మ్యాట్రిక్స్ ఫిట్‌నెస్ సెంటర్ వ్యవస్థాపకురాలిగా.. యూట్యూబర్‌గా కొన‌సాగుతోంది.