Begin typing your search above and press return to search.

బాబోయ్ కీర్తి కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసిందిగా ..!

సౌత్ లో ఎంత టాప్ హీరోయిన్ గా ఉన్నా సరే కొందరు భామలు గ్లామర్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు.

By:  Tupaki Desk   |   25 April 2024 5:58 AM GMT
బాబోయ్ కీర్తి కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసిందిగా ..!
X

సౌత్ లో ఎంత టాప్ హీరోయిన్ గా ఉన్నా సరే కొందరు భామలు గ్లామర్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు. మిగతా హీరోయిన్స్ ఎంత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా గ్లామర్ విషయంలో కండీషన్స్ పెడుతుంటారు. కేవలం అభినయంతోనే ఆడియన్స్ ను మెప్పించాలనే ఆలోచనతో కొందరు కథానాయికలు ఉంటే.. ఎలాగైనా ప్రేక్షకుల మెప్పు పొందాలనే ఆలోచన మరికొందరికి ఉంటుంది. సౌత్ సినిమాల్లో కేవలం తమ యాక్టింగ్ తోనే మెప్పించి నార్త్ సైడ్ వెళ్లగానే గ్లామర్ షో చేస్తున్న హీరోయిన్స్ కొందరు ఉంటారు.


సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా బాలీవుడ్ నీళ్లు పడగానే గ్లామర్ గేట్లు ఎత్తేస్తారు. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లిన చాలామంది హీరోయిన్స్ ఇదే బాట కొనసాగించగా లేటెస్ట్ గా అదే దారిలో వెళ్తుంది మహానటి కీర్తి సురేష్. మలయాళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న ఈ అమ్మడు ఈమధ్య గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతుంది.

సౌత్ లో స్టార్ క్రేజ్ తోనే బాలీవుడ్ ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమాలో నటించింది. కాలీస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముందు ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నా ఇప్పుడు అది మే ఎండింగ్ కు వెళ్లింది. బేబీ జాన్ ప్రచార చిత్రాలు రిలీజ్ కాగా అందులో కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ చూసి సౌత్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ వెళ్లగానే కీర్తి సురేష్ కూడా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిందని అంటున్నారు.

లేటెస్ట్ గా బేబీ జాన్ సినిమాలోని ఒక సాంగ్ లో కీర్తి సురేష్ లుక్ ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది. ఇన్నాళ్లు సౌత్ లో క్లీన్ సర్టిఫికెట్ తో మెప్పించిన కీర్తి సురేష్ బాలీవుడ్ వెళ్లగానే ఇలా స్కిన్ షోతో రెచ్చిపోతుందని అంటున్నారు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే ఆమె లోని ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కి ఖుషి అవుతున్నారు. బేబీ జాన్ హిట్ పడితే మాత్రం కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. సో రష్మిక తర్వాత కీర్తి సురేష్ కూడా అక్కడ బిజీ అయ్యేలా ఉంది.