Begin typing your search above and press return to search.

కావ్య మారన్ ఫుల్ జోష్.. ఆ స్టార్ హీరో మాటే నిజమైంది!

ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ పర్సన్ అంటూ నెటిజన్లు కావ్య మారన్ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 9:54 AM GMT
కావ్య మారన్ ఫుల్ జోష్.. ఆ స్టార్ హీరో మాటే నిజమైంది!
X

సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. ఆమె నవ్వుతూ గంతులేస్తున్న పిక్స్, వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ పర్సన్ అంటూ నెటిజన్లు కావ్య మారన్ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. అయితే కావ్య సంతోషానికి కారణం అందరికీ తెలిసిందే. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ అదరగొట్టింది.

సిక్సర్ల వర్షం కురిపించిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు.. భారీ స్కోరు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు-277 నమోదు చేశారు. అయితే సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు.. కెమెరాల కళ్లన్నీ కావ్య మారన్ వైపే ఉన్నాయి. సిక్సర్ పడితే చాలు.. ఆమె ఎగిరి గంతేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక మ్యాచ్ గెలిచాక.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. స్టాండ్స్ లో ఓ రేంజ్ లో సందడి చేసింది. సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసింది.

ఇక కావ్య మారన్ ఫుల్ హ్యాపీ గా ఉండడంతో నెటిజన్లు.. కొన్ని నెలల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు. కావ్య సంతోషానికి రజినీకాంత్ కామెంట్స్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ ఆడియో లాంఛ్ లో తలైవా.. ఎస్ ఆర్ హెచ్ టీమ్ ప్రస్తావనను తీసుకొచ్చారు. కావ్య పాపను ఏడిపించకండి, చూడలేకపోతున్నట్లు తెలిపారు రజినీ కాంత్.

"ఐపీఎల్ లో భాగంగా ఏదైనా మ్యాచ్ లో ఎస్‌ ఆర్‌ హెచ్‌ ఓడిపోతే స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. కొన్ని సందర్భాల్లో టీవీ ఛానల్‌ ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్‌ (కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నా. వేలంలో మెరుగైన ఆటగాళ్లను సొంతం చేసుకుని జట్టును మరింత బలపేతం చేయాలి" అని రజినీ అప్పుడు సూచించారు.

అప్పుడు రజినీ ఇచ్చిన సలహా ఫలితమే నిన్న హైదరాబాద్ సంచలన విజయంగా నెటిజన్లు కొనియాడుతున్నారు. తలైవా మాట్లాడిన వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. కావ్య ఆనందానికి కూడా రజినీనే కారణమని అంటున్నారు. ఇది 100 శాతం నిజం అంటూ ఎస్ ఆర్ హెచ్ టీమ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ సారి కచ్చితంగా కప్పు కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదే జోష్ తో వరుస మ్యాచ్లు గెలవాలని ఆశిస్తున్నారు. మరి చూడాలి ఈ సారి.. హైదరాబాద్ టీమ్ ఏం చేస్తుందో.