Begin typing your search above and press return to search.

చ‌క్రాస‌న భంగిమ‌తో హ‌డ‌లెత్తించిన బెబో

క‌రీనా న‌టించిన క్రూ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ - అనిల్ కపూర్ ఫిల్మ్ & కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ బ్యానర్ లు నిర్మించాయి.

By:  Tupaki Desk   |   17 April 2024 11:10 AM GMT
చ‌క్రాస‌న భంగిమ‌తో హ‌డ‌లెత్తించిన బెబో
X

క‌రీనా కపూర్, టబు, కృతి సనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం `క్రూ` బాక్సాఫీస్ వ‌ద్ద‌ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నాయికా ప్ర‌ధాన ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల క్ల‌బ్‌లో చేరి నిర్మాత‌లకు భారీ లాభాల్ని అందించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో క‌రీనా క‌పూర్ ఖాన్ పాత్ర అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు. క‌రీనా చిలిపి ఎయిర్ హోస్టెస్ గా మైమ‌రిపించే న‌టన‌తో ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల మమ్మీ అయిన బెబో ఇప్ప‌టికీ వెండితెర‌పై హాట్ గా క‌నిపిస్తోంది. మ‌రోవైపు క‌రీనా క‌పూర్ త‌న అందాన్ని కాపాడుకునేందుకు ఎంత‌గా శ్ర‌మిస్తుందో తాజాగా రిలీజైన యోగాస‌నాల ఫోటోలు వెల్ల‌డిస్తున్నాయి.


తొలి నుంచి బెబో ఫిట్ నెస్ ఫ్రీక్. యోగా, జిమ్ ని అస్స‌లు విడిచిపెట్ట‌దు. ఇప్పుడు చక్రాస‌నం స‌హా ర‌క‌ర‌కాల అస‌నాల‌కు సంబంధించిన ఫోటోల‌ను వీడియోల‌ను క‌రీనా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఇవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. బెబో ఫిట్ గా బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోందంటూ ఈ ఫోటోల‌కు కామెంట్లు కురుస్తున్నాయి.

క‌రీనా న‌టించిన క్రూ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ - అనిల్ కపూర్ ఫిల్మ్ & కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ బ్యానర్ లు నిర్మించాయి. ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడవ వారాంతంలోను అంచ‌నా మార్కును తాకింది. ఆ తర్వాత సోమవారం నాడు వ‌సూళ్లు భారీగా త‌గ్గాయి. 19వ రోజున `క్రూ` స్లో పేస్ మెయింటెయిన్ చేసినప్పటికీ భార‌త‌దేశంలో బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల మార్కును దాటగలిగింది. అదే స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 130 కోట్లు వ‌సూలు చేసింద‌ని స‌మాచారం.

క్రూ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కార్డ్

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1 రూ 9.25 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 2 రూ. 9.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 3 రూ. 10.5 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4 రూ. 4.2 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 5 రూ 3.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 6 రూ. 3.3 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 7 రూ 3 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 8 రూ. 3.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 9 రూ. 5.25 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 10 రూ. 5.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 11 రూ. 1.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 12 రూ. 2. 15 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 13 రూ 1.6 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 14 రూ 1.15 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 15 రూ 0.85 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 16 రూ 1.65 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 17 రూ 1.75 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 18 రూ 0.43 కోట్లు

క్రూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 19 రూ 0.43 కోట్లు

క్రూ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 70.26 కోట్లు (స్వ‌దేశీ వ‌సూళ్లు)

తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మార్కును అధిగమించింది.