Begin typing your search above and press return to search.

ప్రభాస్ కల్కి.. మేకర్స్ కొత్త ప్లాన్ ఇదే..

ఇటీవల బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   27 April 2024 5:16 AM GMT
ప్రభాస్ కల్కి.. మేకర్స్ కొత్త ప్లాన్ ఇదే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు ఫ్యాన్స్ తోపాటు ప్రపంచవాప్యంగా ఉన్న సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. మే9వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఆలస్యం, ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా వాయిదా పడడం ఖరారే. అయితే ఇప్పటి వరకు మేకర్స్.. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.

ఇటీవల బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఫస్ట్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారని టాక్ వినిపించింది. కానీ ఇవేం నిజం కాలేదు. అమితాబ్ గ్లింప్స్ మాత్రం విడుదలైంది. నాగ్ అశ్విన్ పుట్టినరోజు స్పెషల్ గా ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు కల్కి అప్డేట్ విషయంలో చాలా డిస్సపాయింట్ అయ్యారు.

ఇదే సమయంలో కల్కి మేకర్స్.. శనివారం సాయంత్రం 5 గంటలకు అప్డేట్ ఇస్తామని నిన్న ప్రకటించారు. సమయం ఆసన్నమైందని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ అప్డేట్ రిలీజ్ డేట్ కోసమేనని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ట్రేడ్ పండితులు, డిస్ట్రిబ్యూటర్లతో సుదీర్ఘ చర్చల తర్వాత కల్కి మూవీని జులై 27వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్నే ఈరోజు అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

అయితే జులై 4వ తేదీ అమెరికాలో తప్ప ఆ నెలలో ఇండియాలో ఎలాంటి సెలవులు, పండుగలు లేవు. జులై 27వ తేదీ శనివారం పడుతుంది. లాంగ్ వీకెండ్ కూడా కాదు. కానీ టాలీవుడ్ లో కొద్ది నెలల్లో ఇదే తొలి భారీ బడ్జెట్ మూవీ రిలీజ్. దీంతో కల్కి సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన వసూళ్లు రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఇక జూన్ 13వ తేదీన కమల్ హాసన్ ఇండియన్-2 రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన పుష్ప-2 విడుదల కానుంది. అంటే కల్కి.. ఇండియన్-2, పుష్ప-2 మధ్యలో విడుదల కానుందన్నమాట.

హిందూ పురాణాల్లోని క‌ల్కి అవ‌తార గాథ‌ నుంచి స్ఫూర్తి పొందుతూ మోడ్ర‌న్ స్టైల్‌ లో డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.600 కోట్ల భారీ బ‌డ్జెట్‌ తో ప్రముఖ వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. మూవీలో ప్ర‌భాస్‌ కు జోడీగా దీపికా ప‌దుకొణే హీరోయిన్‌ గా న‌టిస్తోంది. క‌ల్కి మూవీతోనే దీపిక టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.