Begin typing your search above and press return to search.

కల్కి.. ఇక ఈ రెండింటిలో ఒకటి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 ఏడీ.

By:  Tupaki Desk   |   28 March 2024 4:12 AM GMT
కల్కి.. ఇక ఈ రెండింటిలో ఒకటి!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా సిద్ధం చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్, స్వప్న దత్ ఏకంగా 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 ఏడీ మీద ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.

దీనికి కారణం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొదటిసారి రాబోతున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కావడమే. ఈ సినిమా కథ మొత్తం నాగ్ అశ్విన్ ఇమాజినరీ వరల్డ్ లోనే నడుస్తుంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని శ్రీమహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. యుగాంతం సమయంలో జరగబోయే విపరీతాలు ఎలా ఉంటాయి. వాటిని కల్కి భగవానుడు ఎలా నియంత్రిస్తాడు అనే పాయింట్స్ హైలెట్ అవుతాయట.

అలాగే హీరో దుష్టులని ఎలా అంతం చేస్తాడు అనే అంశాలు మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీ బిజినెస్ డీల్స్ ప్రస్తుతం క్లోజ్ చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు. వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి ఉండనుంది.

ఎన్నికల బజ్ సినిమా కలెక్షన్స్, ప్రమోషన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని భావించి రిలీజ్ వాయిదా వేశారు. నెక్స్ట్ డేట్ కోసం ప్రస్తుతం డిస్కషన్స్ చేస్తున్నారు. జూన్ లేదా జులై నెలల్లో కచ్చితమైన డేట్ చూసుకొని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. గతంలో ఆగష్టులో ఉంటుందనే టాక్ వినిపించింది. బయ్యర్ల రిక్వస్ట్ లని పరిగణంలోకి తీసుకొని ముందుగానే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. అందుకే జూన్ లేదా జూలై నెలలో ఏదో ఒక డేట్ ఫిక్స్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

త్వరలో రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కల్కి నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్ గ్లింప్స్ మాత్రమే వచ్చాయి. టీజర్, సాంగ్స్ లాంటివి రిలీజ్ చేస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు కోరుతున్నారు. చిత్ర యూనిట్ కూడా టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే చాలా ఏరియాల్లో ఇంకా బిజినెస్ డీల్స్ క్లోజ్ కాలేదు. నిర్మాత అశ్విని దత్ టెంప్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్ డీల్స్ సెట్ చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.