Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ పక్కన ఈమె సెట్‌ అయ్యేనా..?

ఈ సమయంలో ప్రభాస్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 April 2024 7:41 AM GMT
ప్రభాస్‌ పక్కన ఈమె సెట్‌ అయ్యేనా..?
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే కల్కి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే సలార్‌ 2 కూడా ప్రారంభం అయ్యింది. ఈ సమయంలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పాడు.

కల్కి సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ దీపికా పదుకునే మరియు దిశా పటానీ లు జోడీగా నటించిన విషయం తెల్సిందే. ఇక రాజాసాబ్‌ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ తో పాటు మరో హీరోయిన్ నటిస్తోంది. సలార్ 2 లో శృతి హాసన్ తో పాటు మరో బాలీవుడ్‌ హీరోయిన్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభాస్ కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నటనకు ఆస్కారం ఉండే విధంగా హీరోయిన్స్ పాత్రలను దర్శకుడు క్రియేట్‌ చేస్తాడు. కనుక జాన్వీ కపూర్ కి ఈ సినిమా కచ్చితంగా మంచి ఆఫర్‌ అనడంలో సందేహం లేదు.

అయితే ప్రభాస్ కు జోడీగా జాన్వీ కపూర్‌ ఎంత వరకు సెట్‌ అయ్యేను అనేది కొందరు వ్యక్తపర్చుతున్న అనుమానం. ప్రభాస్‌ హైట్‌ మరియు ఇతర విషయాల కారణంగా జాన్వీ కపూర్‌ కాస్త చిన్నగా అవుతుందేమో అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కథ మరియు పాత్ర సెట్‌ అయితే జోడీ గురించి పెద్దగా అనుమానం అక్కర్లేదు. దర్శకుడు హను రాఘవపూడి పాత్రలకు తగ్గట్లుగా నటీనటులను ఎంపిక చేయడంలో సిద్దహస్తుడు. సీతారామం సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ఆయన ఎంపిక ఎంతటి మంచి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వేళ ప్రభాస్ కి జోడీగా జాన్వీ వార్తలు నిజం అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం.