Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. హిందీ రేటెంత?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 4:43 AM GMT
గేమ్ ఛేంజర్.. హిందీ రేటెంత?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో నెల రోజుల్లోనే మూవీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దిల్ రాజు మూవీని ఏకంగా 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ కమర్షియల్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది.

మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ పార్టీ నాయకుడి పాత్రలో కూడా హైలెట్ కానున్నాడు. తండ్రి, కొడుకులుగా రామ్ చరణ్ మూవీలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే అఫీషియల్ ఇంకా ప్రకటించలేదు.

రామ్ చరణ్ నుంచి రాబోయే ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండియాలో రాజమౌళి కంటే ముందుగానే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న వ్యక్తి శంకర్. అలాంటి స్టార్ డైరెక్టర్ తెలుగులో చేస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో, ఈ చిత్రంపై అంచనాలు హెవీగా ఉన్నాయి. శంకర్ సినిమాలు అంటే సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ అంశాలు జోడించి చెబుతాడనే అభిప్రాయం అందరిలో ఉంది.

అతని సినిమాలకి అన్ని భాషలలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఈ కారణంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి హిందీ నుంచి రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చాయి. ఫైనల్ గా స్టార్ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని మూవీ హక్కులని 75 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తోన్న సినిమా కావడంతో నార్త్ ఇండియాలో కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

ఈ కారణంగానే 75 కోట్లు పెట్టి హిందీ థీయాట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ మూవీలో ఉండటం కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్ఆర్ఆర్ అల్లూరి క్యారెక్టర్ లో నార్త్ ఇండియన్ అందరూ చరణ్ లో శ్రీరాముడిని చూసారు. దీంతో అతను అందరికి బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ కి హిందీ బెల్ట్ లో భారీ లాభాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.