Begin typing your search above and press return to search.

'ఫైటర్ రాజా'.. విశ్వక్ సేన్ లాంచ్ చేసిన థ్రిల్లింగ్ టీజర్‌!

కృష్ణ ప్రసాద్ వత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాయా కృష్ణన్‌ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   28 March 2024 12:52 PM GMT
ఫైటర్ రాజా.. విశ్వక్ సేన్ లాంచ్ చేసిన థ్రిల్లింగ్ టీజర్‌!
X

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ ఎంతో మంది హీరోలకు స్టైలిస్ట్‌గా పనిచేసిన పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ రామ్జ్.. 2021లో 'పచ్చీస్' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు. ఇప్పుడు 'ఫైటర్ రాజా' అనే స్టైలిష్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. కృష్ణ ప్రసాద్ వత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాయా కృష్ణన్‌ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇటీవల 'ఓం భీమ్ బుష్' నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కలిసి ఆవిష్కరించిన 'ఫైటర్ రాజా' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో గురువారం (మార్చి 28) హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ సినిమా టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు.

"మా అయ్య కన్స్ట్రక్షన్ సైట్ లేబర్ అన్నా.. స్క్రాప్ అమ్ముకొని డబ్బులు చేసుకునే కాన్సెప్ట్ మా అయ్య చెప్పిందే.. నా అసలు జాబ్ ఫైటర్ అన్నా" అంటూ హీరో రామ్స్ తనను తాను పరిచయం చేసుకోవడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. స్క్రాప్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదించే రాజా.. ఫైటింగ్స్ మీద మక్కువతో సినీ ఇండస్ట్రీలో ఫైటర్‌గా పని చేస్తున్నాడు. అతని ప్రేయసి మాయా కృష్ణన్ కూడా అదే ఫీల్డ్ లో వర్క్ చేస్తోంది.

అయితే రాజా తనకున్న సమస్యలకు పరిష్కారించుకోడానికి చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఏదో పెద్ద ప్లాన్ వేసి, ఒకరి నుండి డబ్బుతో పాటుగా ఒక గన్ దొంగిలించి తప్పించుకోవడంతో అసలు కథ మొదలైనట్లు 'ఫైటర్ రాజా' టీజర్ లో కనిపిస్తోంది. ఇందులో 'మన దగ్గర ఏదైనా కొనేంత డబ్బైనా ఉండాలి. డబ్బు కూడా కొనలేని పవర్ అయినా ఉండాలి' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

రాంజ్ విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో మంచి ఈజ్ తో నటించాడు. అతని క్యారెక్టర్ సీరియస్ గా కనిపించినా ఫన్ జనరేట్ చేసింది. మాయా కృష్ణన్‌ ఒక లేడీ ఫైటర్ గా యాక్షన్ సీన్స్ లో ఆశ్చర్య పరిచింది. దీంట్లో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. టెక్నికల్ గా కూడా కూడా సినిమా బాగుంది. శ్రీధర్ కాకిలేటి దీనికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, స్మరణ్ సాయి సంగీతం సమకూర్చారు. హరిశంకర్ & అవంతి రుయా ఎడిటింగ్ చేశారు.

వినూత్న కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో 'ఫైటర్ రాజా' సినిమాని రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇందులో చక్రధర్‌, శివనందు, రోషన్‌, తాగుబోతు రమేష్‌, సత్య ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రన్‌వే ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్‌ యాదవ్‌, పుష్పక్‌ జైన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.