Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ఈషా పాప...కొంచెం కొత్తగా!

ఈషా పాపా గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది.

By:  Tupaki Desk   |   24 April 2024 7:47 AM GMT
ఫోటో స్టోరీ : ఈషా పాప...కొంచెం కొత్తగా!
X

సినిమా ఇండస్ట్రీలో పలు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తెలుగు పాప ఈషా రెబ్బ. అమ్మడు మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే మంచి సక్సెస్ లను సొంతం చేసుకుంది. 2012 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ వరంగల్ అమ్మాయి ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పెద్ద సినిమాలలో కూడా స్పెషల్ పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే.

తన పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా మంచి కంటెంట్ ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈషా పాపా గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అప్పుడప్పుడు ఊహించిన విధంగా గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫోటోషూట్స్ లో పాల్గొంటూ ఉంటుంది.

రీసెంట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ లో తనదైన శైలిలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె చూపులతోనే ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఇంతకంటే ఘటైన స్టిల్స్ లలో కూడా కనిపించిన ఈషా పాప ఇప్పుడు మాత్రం మరింత అందంగా కనిపిస్తోంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత అమ్మడు అంతకుముందు ఆ తర్వాత.. అనే సినిమాతో మొదటి విజయాన్ని అందుకుంది. అనంతరం బందిపోటు, దర్శకుడు, బ్రాండ్ బాబు లాంటి సినిమాలు చేసింది. అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. ఇక సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈషా రెబ్బ గ్లామరస్ రోల్స్ తో కూడా తనను తాను మరింత కొత్తగా చూపించుకోవాలి అని ఆసక్తి చూపిస్తోంది.

అయితే కేవలం స్కిన్ షోకు మాత్రమే పరిమితం కాకుండా క్యారెక్టర్ లో బలమైన కంటెంట్ ఉండాలి అనే విధంగా కూడా ఆమె ఆలోచిస్తోంది. ఇక చివరగా ఆమె నుంచి వచ్చిన చిత్రం మామ మశ్చింద్ర. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ప్రస్తుతం ఒక రెండు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.