Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కూతురును చూశారా...!

తెలుగు హీరోల రేంజ్ లో మోహన్ లాల్ కి కూడా టాలీవుడ్‌ లో మంచి క్రేజ్ క్రియేట్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   28 March 2024 2:30 PM GMT
సూపర్ స్టార్‌ కూతురును చూశారా...!
X

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో విడుదల అవుతూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తెలుగు హీరోల రేంజ్ లో మోహన్ లాల్ కి కూడా టాలీవుడ్‌ లో మంచి క్రేజ్ క్రియేట్‌ అయ్యింది.

మోహన్ లాల్‌ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. చాలా మంది తెలుగు వారికి మోహన్ లాల్ పిల్లలు తెలిసి ఉండరు. మోహన్ లాల్ తనయుడి పేరు ప్రణవ్ మోహన్‌ లాల్‌ కాగా కూతురు పేరు విస్మయ మోహన్ లాల్‌.

సోషల్ మీడియా ద్వారా మోహన్ లాల్ తన కూతురు విస్మయ మోహన్‌ లాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ సమయంలో ఆమె ఫోటోను షేర్‌ చేశాడు. మై ప్రిన్సెస్‌ అంటూ మోహన్ లాల్ తన కూతురు కి ఆత్మీయ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇక మోహన్ లాల్‌ సినిమాల విషయానికి వస్తే... తెలుగులో కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. నాలుగు మలయాళ సినిమాల్లో కూడా ఈయన ప్రస్తుతం నటిస్తున్నాడు. అందులో ఈ ఏడాది లో కొన్ని విడుదల అవ్వబోతూ ఉండగా మరికొన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మోహన్ లాల్‌ తన కూతురు ఫోటోను షేర్‌ చేసి బర్త్‌ డే విషెష్ చెప్పడంతో నెట్టింట వైరల్‌ అవుతోంది. విస్మయ ను హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మోహన్‌ లాల్‌ తన కూతురును ఎందుకు సినిమాలకు పరిచయం చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.