Begin typing your search above and press return to search.

10 వేల‌ కోట్ల ఆస్తుల‌తో బాలీవుడ్‌లో నంబ‌ర్‌-1 ఫ్యామిలీ

కపూర్ కుటుంబం, బచ్చన్ కుటుంబం లేదా ఖాన్‌ల త్ర‌యం హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులు అని చాలా మంది సినీ ఔత్సాహికులు భావిస్తారు

By:  Tupaki Desk   |   25 April 2024 12:30 AM GMT
10 వేల‌ కోట్ల ఆస్తుల‌తో బాలీవుడ్‌లో నంబ‌ర్‌-1 ఫ్యామిలీ
X

దశాబ్దాలుగా అనేక ధనిక కుటుంబాలు, స్టార్ల‌కు బాలీవుడ్ ఆశ్రయం కల్పించింది. కపూర్ కుటుంబం, బచ్చన్ కుటుంబం లేదా ఖాన్‌ల త్ర‌యం హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులు అని చాలా మంది సినీ ఔత్సాహికులు భావిస్తారు. అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల నికర ఆస్తుల‌ విలువ బాలీవుడ్‌లో టీసిరీస్ య‌జ‌మాని భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తుల‌ కంటే తక్కువ అని తెలిస్తే షాక్ అవ్వ‌కుండా ఉండ‌లేరు.

ఒక ప్ర‌ముఖ హిందీ మీడియా విశ్లేష‌ణ ప్ర‌కారం.. బాలీవుడ్‌లో టీసిరీస్ గుల్ష‌న్ కుమార్ ఆస్తులు 10,000 కోట్లు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రా కుటుంబానికి రూ.7,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. షారుక్ ఖాన్ నికర ఆస్తుల‌ విలువ రూ. 6,000 కోట్లు. ధర్మ ప్రొడక్షన్స్ యజమాని కరణ్ జోహార్ కుటుంబ ఆస్తులు రూ. 1,700 కోట్లు అని తెలుస్తోంది. బాలీవుడ్‌లో మొదటి కుటుంబంగా పేరుగాంచిన కపూర్ కుటుంబం ఆస్తుల విలువ దాదాపు 1,000 కోట్లు.

అయితే ఎంద‌రో దిగ్గ‌జ స్టార్లు ఉన్న కుటుంబాల‌ను మించి టీసిరీస్ వేల కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్ -1 స్థానాన్ని అందుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశం. టి-సిరీస్ అనే మ్యూజిక్ లేబుల్ కంపెనీని స్థాపించి ద‌శాబ్ధాల ప్ర‌స్థానంతో గుల్ష‌న్ కుమార్ చ‌రిత్ర‌కారుడిగా నిలిచారు. ఆయన మ‌ర‌ణానంత‌రం వార‌సుడు భూషణ్ కుమార్ కుటుంబ ఆస్తుల‌ను పెంచ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. ఆయ‌న భారీ చిత్రాల‌ నిర్మాతగాను అసాధార‌ణ విజ‌యాల్ని అందుకుంటున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుల ఫ్యామిలీగా రికార్డుల‌కెక్కిన టీసిరీస్ ఫ్యామిలీ అసాధార‌ణ విజ‌యాల రికార్డును ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉంది. ఈ కుటుంబం నికర ఆస్తుల‌ విలువ సూపర్ స్టార్లు ఉన్న కపూర్లు, బచ్చన్లు, ఖాన్ లు, జోహార్‌లు వంటి ప్రఖ్యాత కుటుంబాల సంపదను మించి ఎదిగింది.

భూషణ్ కుమార్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ అధినేత‌గా, అగ్ర‌నిర్మాత‌గా అసాధార‌ణ ప్ర‌జ్ఞ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. అతడు T-సిరీస్ మ్యూజిక్ లేబుల్‌కి ఛైర్మన్‌ కూడా.. హురున్ ఇండియా రిచ్ సెల‌బ్ లిస్ట్ 2022 ప్రకారం.. భూషణ్ కుమార్ అతడి కుటుంబం దాదాపు రూ. 10,000 కోట్ల నికర ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టారు. T-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్‌కు అతని బాబాయ్ క్రిషన్ కుమార్ (మాజీ నటుడు , గుల్షన్ సోదరుడు) వ్యాపారంలో సహాయం చేస్తారు. అతడి సోదరి ఖుషాలి నటి కాగా, తులసి కుమార్ బాలీవుడ్‌లో గాయని. వారు కూడా ఫ్యామిలీ షోబిజ్‌లో భాగమే. భూషణ్ కుమార్ నటి కం ద‌ర్శ‌క‌నిర్మాత‌ దివ్య ఖోస్లా కుమార్‌ను వివాహం చేసుకున్నారు. నటి దివ్య ఖోస్లా కుమార్ T-సిరీస్ కంపెనీలో 0.45 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే భూషణ్ కుమార్ వ్యక్తిగతంగా కేవలం 414 కోట్ల రూపాయల ఆస్తుల‌ను మాత్రమే క‌లిగి ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఐదు ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇన్నేళ్ల‌లో క‌లికితురాయి అన‌ద‌గ్గ సినిమాల‌ను నిర్మించింది. వైఆర్ఎఫ్‌ యజమాని ఆదిత్య చోప్రా కుటుంబానికి రూ.7,000 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ యజమాని కరణ్ జోహార్ , అతడి కుటుంబం ఆస్తులు రూ. 1,700 కోట్లుగా అంచనా. బాలీవుడ్‌లో మొదటి కుటుంబంగా పేరుగాంచిన కపూర్ కుటుంబం చాలా మంది సూపర్‌స్టార్‌లను అందించింది. అయితే వారి మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు.

ఇటీవ‌ల ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. కింగ్ ఖాన్ షారుక్ నికర ఆస్తుల‌ విలువ రూ. 6000 కోట్లు. ఖాన్ అత్యంత సంపన్న భారతీయ నటుడిగా రికార్డుల‌కెక్కారు. అత‌డి తర్వాత సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల‌ విలువ రూ. 2,900 కోట్లు కాగా, అమీర్ ఖాన్ నికర ఆస్తుల‌ విలువ రూ. 1,862 కోట్లు. ఈ ముగ్గురి నికర ఆస్తుల‌ విలువను ఏక‌మొత్తంగా చూస్తే రూ. 9,700 కోట్లు. ఇది భూషణ్ కుమార్ కుటుంబ నికర ఆస్తుల‌ విలువ కంటే కొంచెం తక్కువ. ఇంకా చెప్పాలంటే ఖాన్ ల త్ర‌యానికి భూష‌ణ్ కుమార్ స‌రి స‌మానం.