Begin typing your search above and press return to search.

భజే వాయు వేగం.. సరైన డేట్ కే..

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మే 31న 'భజే వాయు వేగం' వస్తుంది. క్రేజీ రైడ్‌ కు రెడీ అవ్వండి'' అని యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   8 May 2024 12:17 PM GMT
భజే వాయు వేగం.. సరైన డేట్ కే..
X

ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్, యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం భజే వాయు వేగం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్‌ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ మూవీలో కార్తికేయ యూనిక్ రోల్‌ లో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సాలిడ్‌ కంటెంట్‌ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ''ఫైనల్ షోకు పిచ్ రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మే 31న 'భజే వాయు వేగం' వస్తుంది. క్రేజీ రైడ్‌ కు రెడీ అవ్వండి'' అని యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేసింది.

గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకుని కార్తికేయ నిల్చుని ఉన్న పోస్టర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కార్తికేయకు జంటగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ విషెస్ తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో లంగా వోణీలో ఐశ్వర్య అట్రాక్ట్ చేస్తోంది. ఆమె పోస్టర్ ను షేర్ చేస్తూ 'సెట్‌ అయ్యిందే' అనే సాంగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. గురువారం ఉదయం 9:09 గంటలకు పాటను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్‌ సంగీతం అందిస్తున్నారు. కపిల్‌ కుమార్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఆర్‌ డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. అజయ్‌ కుమార్‌ రాజు సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. టీజర్ ప్రకారం.. డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారి హత్యకు గురవుతాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత హీరో కార్తికేయకు, తండ్రికి మధ్య రిలేషన్ చూపించారు మేకర్స్. ఆ సమయంలో హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మరి తండ్రీకొడుకుల ఎమోషన్ తోపాటు డ్రగ్స్ కేసు ఏంటనేది మే 31న సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.