Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా ప‌ట్టీల డ్రెస్సు.. క‌ళ్లు తిప్పుకోలేరిక‌!

సుందర్ సి తెర‌కెక్కించిన‌ హర్రర్ కామెడీ `అరణ్మనై 4` నుండి `అచాచో` ప్రోమో సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 April 2024 11:18 AM GMT
త‌మ‌న్నా ప‌ట్టీల డ్రెస్సు.. క‌ళ్లు తిప్పుకోలేరిక‌!
X

సుందర్ సి తెర‌కెక్కించిన‌ హర్రర్ కామెడీ `అరణ్మనై 4` నుండి `అచాచో` ప్రోమో సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తమన్నా భాటియా-రాశి ఖన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ నూతన సంవత్సరం నాడు విడుదలైన ఈ పాట అంత‌ర్జాలంలోకి దూసుకుపోయింది. రాశీ, త‌మ‌న్నా అంద‌చందాల‌తో ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని తీర్చిదిద్దారు. పాట ఇన్ స్టంట్ హిట్. ఈ హార‌ర్ చిత్రంలో ఎలాంటి థ్రిల్స్ ఉంటాయో కూడా ఈ పాట‌లో చూపించారు. ఇక వీట‌న్నిటినీ మించి త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా హార‌ర్ థ్రిల్ల‌ర్ లో ఎలాంటి పాత్ర‌ల‌తో అల‌రిస్తారో కూడా ఈ పాట‌లోనే ప్ర‌ద‌ర్శించారు. ఈ చిత్రాన్ని ఖుష్బు సుందర్ నిర్మించారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ని #BAAK పేరుతో ఏషియ‌న్ సినిమాస్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు. మే 3 నుంచి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంద‌డి చేస్తుంద‌ని తాజాగా మేక‌ర్స్ వెల్ల‌డించారు. దీంతో హైద‌రాబాద్ మీడియాలో గ్లామ‌ర‌స్ డాళ్స్ త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నాల హంగామా ఒక రేంజులో క‌నిపిస్తోంది.

తాజాగా మీడియా ఇంట‌ర్వ్యూల్లో బిజీగా ఉన్న త‌మ‌న్నా, రాశీ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలోకి విడుద‌ల‌య్యాయి. ``అద్భుతమైన అంద‌గ‌త్తెలు త‌మ‌న్నా, రాశీ #Baak తెలుగు ప్రమోషన్‌లలో అబ్బురపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలతో ప‌లు ఛానెళ్ల‌ను అలంకరించారు. పూర్తి ఇంటర్వ్యూల కోసం వేచి ఉండండి అంటూ ప్ర‌మోష‌న్స్ ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇక తెలుగు మీడియా ప్ర‌మోష‌న్స్ లో త‌మ‌న్నా భాటియా ఎంపిక చేసుకున్న ఒక స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రాశీ ఒక అంద‌మైన బ్లాక్ ఫ్రాక్ ను థై హై డ్రెస్ ని ఎంపిక చేసుకోగా, త‌మ‌న్నా భాటియా బాట‌మ్ లేకుండానే ఒక ఖ‌రీదైన బ్లేజ‌ర్ ని ధ‌రించింది. దీనికి ప‌ట్టీలు వంటి డిజైన్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌మ‌న్నా కాలుపై కాలు వేసుకుని మరీ మీడియాతో చాటింగ్ చేస్తోంది. త‌న థై అందాల‌ను ఈ ప‌ట్టీల డ్రెస్ ఎంతో అందంగా ఎలివేట్ చేసింది. ఖుష్బూ కోసం, సుంద‌ర్ సి కోసం ఇద్ద‌రు అందాల భామ‌ల తెలుగు ప్ర‌మోషన్స్ అదుర్స్ అంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు.