Begin typing your search above and press return to search.

ర‌వితేజ‌తో జాతిర‌త్నాలు ఫేం ఎంత‌వ‌ర‌కూ?

మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా `ఈగిల్` చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా అత‌డి అభిమానులను ప్రేక్షకులను నిరాశపరిచింది

By:  Tupaki Desk   |   24 April 2024 4:26 PM GMT
ర‌వితేజ‌తో జాతిర‌త్నాలు ఫేం ఎంత‌వ‌ర‌కూ?
X

మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా `ఈగిల్` చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా అత‌డి అభిమానులను ప్రేక్షకులను నిరాశపరిచింది. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాంటి చిత్రాల‌తోను ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయాడు. దీంతో వ‌రుస ఫ్లాపులు అత‌డి అభిమానుల‌కు పెద్ద నిరాశ‌నే మిగిల్చాయి. అయితే ఆ మూడు సినిమాలు చేసే క్ర‌మంలోనే అత‌డిని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్క్రిప్టు ఒక‌టి వెతుక్కుంటూ వ‌చ్చింది. కానీ దానిని వెంట‌నే అత‌డు ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు.

జాతిరత్నాలు, ప్రిన్స్ చిత్రాల దర్శకుడు అనుదీప్ కెవి వినిపించిన క‌థ‌ను మాస్ రాజా ఓకే చేశాడు. కానీ వెంట‌నే సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. అప్ప‌టికే రవితేజ కామెడీ సినిమాలో నటించి చాలా రోజులైంది. కానీ ఈ ప్రాజెక్టును వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకురావ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని టాక్ వినిపిస్తోంది.

ఏడాది కాలంగా దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ ఇంకా అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. మాస్ రాజాలోని కామెడీ టింజ్ కి కేవీలోని ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీ సెన్స్ ని జోడిస్తే మంచి వినోదాత్మ‌క సినిమా రూపొందుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ తో ప్రిన్స్ సినిమా చేసిన కేవీ అనుదీప్‌కి ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. అందుకే అత‌డు బిగ్ బ్రేక్ కోసం వేచి చూస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ర‌వితేజ‌తో అత‌డు క‌సిగా హిట్ కొట్టాల‌ని అద్భుత‌మైన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ స్క్రిప్టును రెడీ చేసాడ‌ని టాక్ వినిపిస్తోంది.