Begin typing your search above and press return to search.

పాపం అను పాప.. మరీ అంతలా ఫీల్ అయ్యిందా?

అందులో అనుపమ హ్యాండ్ పొజిషన్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా చాలామంది కామెంట్ చేశారు. మహిళా నటుల కోసం ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి" అని తెలిపారు.

By:  Tupaki Desk   |   28 March 2024 12:38 PM GMT
పాపం అను పాప.. మరీ అంతలా ఫీల్ అయ్యిందా?
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా అనుపమ పరమేశ్వరన్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె టిల్లు స్క్వేర్ తో రెడీ అయ్యింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అన్నీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ నిన్న రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఇది కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధు జొన్నలగడ్డ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ అనుపమ మాత్రం కనిపించలేదు.

అయితే అనుపమ గైర్హాజరుపై ఈవెంట్ లో సిద్ధు మాట్లాడారు. "ఒక పాయింట్ ఉంది. అది మాట్లాడాలో వద్దో అనుకుని మాట్లాడుతున్నా. ఇక్కడ ఈవెంట్ లో అందరూ ఉన్నారు. అనుపమ మాత్రమే లేదు. దానికి ఒక కారణం ఉంది. ఇటీవల టిల్లు స్క్వేర్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో అనుపమ హ్యాండ్ పొజిషన్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా చాలామంది కామెంట్ చేశారు. మహిళా నటుల కోసం ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి" అని తెలిపారు.

"ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది అనేయకూడదు. మీ అందరికీ మాట్లాడే హక్కు ఉంది. నేను దాన్ని తప్పని కూడా అనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్‌ చేస్తే ఎంజాయ్‌ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. మిస్ యూ అనుపమ.. పోస్టర్ పై ఆ కామెంట్స్ తర్వాత అనుపమ మూడ్ బాలేదు. అందుకే ఈవెంట్ కు రాకపోయినా పర్లేదు. హ్యాపీగా ఉండమని నేను చెప్పా. మూవీ రిలీజ్ తర్వాత ఈవెంట్స్ కు ఆమెను కచ్చితంగా తీసుకొస్తా" అని సిద్ధు చెప్పారు.

రీసెంట్ గా మీడియాతో కూడా మాట్లాడారు సిద్ధు. "ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా కామెంట్స్ వస్తుంటాయి. ఎంత వద్దనుకున్నా వాటిని చదువుతాం. అందులో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌ మనపై ఎఫెక్ట్ చూపిస్తాయి. క్రియేటివ్‌ ఫీల్డ్‌ లో ఉన్నవారి మనసు సున్నితంగా ఉంటుంది. అందుకే పిచ్చి పిచ్చి కామెంట్స్ వద్దు" అని రిక్వెస్ట్ చేశారు. మరి కామెంట్స్, రూమర్స్ కు ఈ సినిమా చెక్ పడుతుందో లేదో చూడాలి.