Begin typing your search above and press return to search.

అడ్డొస్తున్నాడని మహిళ భర్త హత్య... పీలేరులో ఘోరం!

ఇందులో భాగంగా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక మహిళ భర్తను హత్య చేశారట అనే సంఘటన పీలేరులో జరిగింది!

By:  Tupaki Desk   |   7 Sep 2023 12:03 PM GMT
అడ్డొస్తున్నాడని మహిళ భర్త హత్య... పీలేరులో ఘోరం!
X

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెచ్చుమీరుతున్న సంగతి తెలిసిందే. అక్రమ సంబంధానికి అడ్డొస్తే మనిషి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడని రోజులు ఇవి. ఈ సమయంలో అలాంటి వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక మహిళ భర్తను హత్య చేశారట అనే సంఘటన పీలేరులో జరిగింది!

వివరాళ్లోకి వెళ్తే... అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీలో ఒక వ్యక్తి (35) భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు! ఈ క్రమంలో మూడున్నరేళ్ల కిందట ఉదరపోషణ నిమిత్త కువైట్‌ వెళ్లారు.

ఈ సమయంలో ఆర్టీసీ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (32) గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడని తెలుస్తుంది. ఆ సమయంలో కువైట్ లో ఉంటున్న వ్యక్తి భార్యకు మాయమాటలు చెప్పి సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కువైట్ నుంచి ఆ మహిళ భర్త మూడు నెలల క్రితం ఊరు వచ్చాడు!

ఈ క్రమంలో తన భార్యతో ఆ మాజీ వాలంటీర్ సాన్నిహిత్యంగా ఉంటున్నాడని తెలుసుకుని పోలీసుస్టేషన్లో చెప్పగా వారు మందలించి పంపించారట. దీంతో ఆ వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడో.. లేక, ఆ మహిళతో సాన్నిహిత్యానికి అడ్డుగా ఉన్నాడని భావించాడో తెలియదు కానీ.. ఏకంగా అడ్డుతొలగించుకోవడానికి పథకం రచించాడట!

అవును... కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి అడ్డుతొలగించుకోవాలని ఫిక్సయిన మాజీ వాలంటీర్... తిరుపతికి చెందిన ముగ్గురు వ్యక్తుల సహాయం తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో సమయం ఫిక్స్ చేసుకున్న ఆ ముగ్గురు వ్యక్తులూ... సైనైడ్ సూదులు కొనుగోలు చేశారట.

ఈ నేపథ్యంలో ఆగస్టు 31న కుమార్తెను పాఠశాల వద్ద దింపడానికి వెళ్లి వస్తున ఆ మహిళ భర్తపై అనుకున్న ప్రకారం ముగ్గురు ఆయన వద్దకొచ్చి సైనేడ్‌ ఎక్కించిన సూదులతో గుచ్చి పరారయ్యారట. దీంతో కాసేపటికే ఆ మహిళ భర్త మృతి చెందారని తెలుస్తుంది. దీంతో... తన భర్త హత్యలో మాజీ వాలంటీర్ పై అనుమానాలున్నాయని ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో ఆ మాజీ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇదేదో వాలంటీర్ చేసిన హత్యగా రాజకీయంగా బురదజల్ళే కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో... ఇతను ఒకప్పుడు వాలంటీర్ గా పనిచేసిన మాట వాస్తవమే కానీ... గతంలోనే విధులనుంచి తప్పించినట్లు అధికారులు చెబుతున్నారని సమాచారం!