ఆ ఊళ్లో ఉండాలంటే సెల్ ఫోన్ వాడకూడదు

Wed Aug 05 2015 12:11:51 GMT+0530 (IST)

అందుబాటులోకి వచ్చే సాంకేతికతను ఉపయోగించుకోవటం.. వీలైనంత సుఖంగా జీవించటం ఆదునిక మానవుడి లక్షణం. అందుకు భిన్నమైన వ్యవహారం అమెరికాలోని ఒక ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ సెల్ ఫోన్ వినియోగించే వారే కనిపించరు.

వినటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఇవాల్టి రోజున సెల్ ఫోన్ లేకపోవటమే చిత్రంగా చూసే పరిస్థితి. అలాంటిది ఒక ఊరు.. ఊరంతా సెల్ ఫోన్.. మైక్రోవేవ్ ఒవెన్ లాంటి వాటిని అస్సలు వినియోగించరు. అంతేకాదు.. కొత్తవాళ్లు ఎవరైనా ఆ ఊళ్లో ఉండాలంటే.. ప్రమాణ పత్రంలో తాము ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడమని ముందస్తుగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ ఉండేందుకు అనుమతిస్తారు.

ఇదంతా.. అమెరికా లాంటి అడ్వాన్స్ దేశానికి చెందిన ప్రాంతంలో ఉండటం మరో విచిత్రంగా చెప్పొచ్చు. ఉత్తర వర్జీనీయాలోని గ్రీన్ బ్యాంక్ అనే ప్రాంతంలో ఇలాంటి జీవనాన్ని అక్కడి ప్రజలు సాగిస్తున్నారు. 13 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే ఈ చిన్న పట్టణంలో మొబైల్ ఫోన్ సర్వీసులు.. వైఫై సర్వీసులతో పాటు.. మైక్రోవేవ్ ఒవెన్ లపై నిషేధం నడుస్తుంది.

ఈ పట్టణంలో జీవించాలంటే.. ఇలాంటివేమీ వాడమంటూ ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. చేతిలో సెల్ ఫోన్ లేకపోతే క్షణం తోచని ప్రస్తుత తరుణంలో సెల్ వినియోగించకున్నా..తాము చాలా సంతోషంగా ఉన్నామంటూ అక్కడి ప్రజలు చెబుతుంటారు. వాడేవారికి దాని సుఖం తెలుస్తుంది కానీ.. వాడనోళ్లకు ఏం తెలుస్తుందంటారా..?