Begin typing your search above and press return to search.

గ్రహాంతర వాసుల కోసం ఇదే పెద్ద వెతుకులాట

By:  Tupaki Desk   |   21 July 2015 2:34 AM GMT
గ్రహాంతర వాసుల కోసం ఇదే పెద్ద వెతుకులాట
X
గ్రహంతర జీవులు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయని, మరికొంత మంది లేవని సెలవిస్తారు! ఉంటే ఎలా ఉన్నాయి? ఒక్కో హాలీవుడ్ డైరెక్టరూ ఒక్కోలా చెబుతారు! ఒక్కో శాస్త్రవేత్త ఒక్కోలా అంచనా వేస్తారు! సామాన్యులకు కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది ఈ విషయంపైన! గాల్లో ఏది సరైన ఆకారం లేకుండా కనిపించినా దానికి ఫోటోలోనో, వీడియోలోనో రౌండప్ చేసేసి... ఇది గ్రహాంతర జీవి అని బొమ్మ చూపించేస్తున్నారు చాలా మంది! ఈ క్రమంలో వీటికి సంబందించిన విషయాలపై తనకున్న ఆసక్తో, అత్యుత్సాహమో లేక మరేదైనానో కానీ... రష్యాకు చెందిన ఒక వ్యక్తి ఈ వ్యవహారానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చాడు!

రష్యా కు చెందిన బిలియనీర్ యూరీ మిల్నర్ గ్రహాంతర జీవుల కోసం అతిపెద్ద పరిశోధన జరపాలని తలంచి, అనుకున్నదే తడువుగా దానికి అంకురార్పణ చేశాడు. దీనికోసం సుమారు 100 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 650 కోట్ల నిధులు సమకూర్చనున్నాడు! ఈ కార్యక్రమాన్ని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ ప్రారంభించారు. సువిశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రాణి ఉంటుందని, అందుకే ఈ పరిశోధన అని, శాస్త్ర అభ్యున్నతికి కోట్లాది రూపాయలు ఖర్చుచేయడానికి ముందుకు వచ్చిన యూరీ మైల్నర్ ను ప్రశంసించారు.