Begin typing your search above and press return to search.

శకలం దొరికింది... పెను విషాదాన్ని జ్ఞప్తికి తెస్తోంది!

By:  Tupaki Desk   |   3 Aug 2015 4:23 AM GMT
శకలం దొరికింది... పెను విషాదాన్ని జ్ఞప్తికి తెస్తోంది!
X
మార్చి18, 2014... కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు సుమారు 239 మంది ప్రయాణికులతో ఒక విమానం బయలుదేరింది. గమ్యస్థానం చేరాల్సిన ఆ విమానం హిందూమహాసముద్రం పరిధిలో అదృశ్యమైపోయింది! ఐదుగురు భారతీయులతో కలిపి ఆ 239 మంది జాడ సముద్రగర్భంలో కలిసిపోయింది!! అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఉన్న టెక్నాలజీని అంతటినీ ఉపయోగించినా కూడా ఆ విమానానికి సంబందించిన చిన్న క్లూ కూడ దొరకలేదు! నిజంగా చెప్పాలంటే... ఆ విమాన ప్రమాదం తర్వాత దొరికాయి అని చెబుతున్న ప్రతీ క్లూ కూడా ఒక భ్రమగానే మిగిలిపోయింది! తాజాగా అలాంటిదే మరో ఆదారం దొరికింది... దాన్ని కూడా ఈ ఎంహెచ్ 370 కి సంబందించినదే అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి! ఆ పెనువిషాదాన్ని మరోసారి జ్ఞప్తికి తెస్తున్నాయి!

తాజాగా హిందూ మహాసముద్రంలో రీయూనియన్ ద్వీప రాజధానికి సెయింట్ నగరంలో ఒక శకలం లభించింది. అయితే ఈ శకాలాలు అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానానికి చెందినది అయి ఉండొచ్చని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో మరో శకలం కూడా వెలుగులోకి రావడంతో ఆ శకలాన్ని పరీక్షల నిమిత్తం ఫ్రాన్స్ కు పంపారు. కాగా... ఈ రెండు శకలాలు ఎంహెచ్ 370కి చెందినవే అయిఉంటాయనే అభిప్రాయాన్ని ఆ ప్రభుత్వం వ్యక్తపరుస్తుంది! కాగా... ఈ అదృశ్యమైన విమానాన్ని దర్యాప్తు చేస్తున్న ఆస్ట్రేలియా మాత్రం... విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని చెబుతుంది!

ఇప్పటికీ ఈ విమానప్రమాదానికి, లేక విమాన అదృశ్యానికి సంబందించిన ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడం మిస్టరీగానే ఉంది! అయితే అప్పట్లో... ఇది ఉగ్రవాదుల పని అని ఒకరంటే... కాదు ఏలియన్స్ పని అయ్యి ఉంటుందని మరొకరు అభిప్రాయపడ్డారు. కాగా హిందూ మహాసముద్రంలోనే కూలిపోయిఉంటుందనేది ప్రభుత్వాల అంచనాగా ఉంది!