ఎట్టకేలకు ఫేస్ బుక్ చీఫ్ కు కల నెరవేరుతుంది

Sat Aug 01 2015 10:48:51 GMT+0530 (IST)

అనుకుంటాం కానీ.. ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. చేతిలో బోలెడంత సంపదన. పేరు ప్రఖ్యాతులకు కొదవ లేకుండా.. తాను కోరుకోవాలే కానీ.. తనను కలిసేందుకు ప్రపంచంలోని దేశాధినేతలంతా క్యూ కట్టే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ కు కష్టాలు ఉన్నాయి.

అంతులేని సంపద చేతిలో ఉన్నప్పటికీ.. తాను తండ్రి కావాలన్నకోరికను మాత్రం  తీర్చుకోలేకపోతున్నారు. 2012లో ప్రిస్కిల్లా జాన్ ను పెళ్లాడిన జుక్.. గత కొన్నేళ్లుగా పిల్లల కోసం తహతహలాడిపోతున్నారు.

వారు ఎంత ఆశ పడుతున్నా.. వారికి పిల్లలు మాత్రం పుట్టటం లేదు. ఇప్పటికి మూడుసార్లు జుక్ సతీమణి గర్భం దాల్చటం.. విచ్ఛితి కావటం జరిగిపోతోంది. దీంతో.. తీవ్ర నిరాశలో వారు ఉండిపోతున్నారు. అయితే.. దీనికి తెర దించుతూ తాజాగా జుక్ సతీమణి మరోసారి గర్భం దాల్చింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకే తీసుకున్న జాగ్రత్తలు ఫలించినట్లేనని చెబుతున్నారు.

తాజాగా అతగాడు.. తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టింగ్ పెట్టాడు. తాను తండ్రిని కానున్నట్లు.. తన భార్య ఒక పాపకు జన్మనివ్వనున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి జుక్ ఏళ్ల నిరీక్షణ త్వరలో సాకారం కానున్నదన్నమాట.