చనిపోయిన భార్యతో 11 ఏళ్లుగా కలిసి ఉంటున్నాడు

Mon Aug 10 2015 13:03:14 GMT+0530 (IST)

కాస్తంత భయంగా.. మరికాస్త బెరుగ్గా అనిపించే ఈ ఉందంతం ఆశ్చర్యంగానూ..విస్మయం కలిగించేలా ఉందని చెప్పక తప్పదు. ఎవరికైనా చెప్పినా వినటం తర్వాత విచిత్రంగా చూడటం ఖాయం. భార్యను అమితంగా ప్రేమించే ఆ భర్తకు తగిలిన ఎదురుదెబ్బ అతన్ని భారీగా ప్రభావితం చేయటమే కాదు.. ఒక కొత్త అలవాటును తయారు చేసింది.

వివరాల్లోకి వెళితే..  వియత్నాంకు చెందిన క్వాంగ్ నాంకు భార్య అంటే చాలా ఇష్టం. కానీ.. దురదృష్టవశాత్తు ఏడేళ్ల కిందట అతని భార్య చనిపోయింది. ఆమె లేని జీవితం అతనికి అంధకారమయంగా అనిపించింది. భార్య లేని జీవితం అతనికి ఏ మాత్రం నచ్చని పరిస్థితి. దీంతో.. నిత్యం రాత్రి అయ్యేసరికి భార్య సమాధి వద్దకు వెళ్లి పడుకునేవాడు.

చలి.. వాన లాంటి వాటిని పట్టించుకోకుండా శ్మశాసనంలో.. భార్య సమాధి పక్కనే విశ్రమించేవాడు. దీంతో కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో తనకొచ్చిన ఐడియాతో శ్మశానంలో ఖననం చేసిన శరీరాన్ని బయటకు తీశాడు. కొన్ని అవశేషాలు మట్టిలో కలిసి పోకుండా ఉండిపోయాయి. అలాంటి వాటిని సేకరించిన ఆయన.. కాగితం.. మట్టితో కలిపి భార్య రూపం మాదిరి ఒక బొమ్మను తయారు చేశాడు.

నిత్యం రాత్రిళ్లు.. ఆ బొమ్మ పక్కనే పడుకొని విశ్రమిస్తాడు. ఇలాంటి వైఖరి ఏడాదో.. రెండేళ్లు కాక దాదాపు 11 ఏళ్లుగా ఇదే తీరులో రాత్రిళ్లు విశ్రమిస్తున్నాడట. అలా మట్టిలో కలవని అవశేషాలతో తయారు చేసిన భార్య బొమ్మలో తన భార్యను చూసుకుంటూ జీవిస్తున్నాడట.