Begin typing your search above and press return to search.

మెర్స్‌కు మెర్సీ లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   9 Jun 2015 9:44 AM GMT
మెర్స్‌కు మెర్సీ లేకుండా పోయింది
X
కొద్దిరోజుల క్రితం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరింత బలమైన వైరస్‌లు దాడి చేస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని.. వైరస్‌ దాడికి ప్రపంచం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటూ మాట్లాడారు. ఆయన మాటలు నిజమయ్యే రోజు ఇంత దగ్గరిగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

తాజాగా దక్షిణ కొరియాను మెర్స్‌ అనే వైరస్‌ వణికిస్తోంది. మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ పేరుతో వ్యవహరించే ఈ వైరస్‌తో ఇప్పటివరకూ ఏడుగురు మరణించారు. మరో ఎనిమిది మందికి ఈ వ్యాధి సోకినట్లు చెబుతున్నారు. ఈ వైరస్‌ దెబ్బకు దక్షిణ కొరియా దేశం వణికిపోతోంది.

ఇక.. ఈప్రాణాంతక వైరస్‌ 95 మంది వరకూ సోకినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. బయటకు వెళ్లే ఆ దేశ పౌరులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెబుతున్నారు. దక్షిణ కొరియాలో స్టార్ట్‌ అయిన ఈ వైరస్‌ మిగిలిన దేశాలకు విస్తరిస్తుందా? అన్నది ఇప్పుడు భయపెట్టేస్తోంది. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనది కావటంతో.. దేశవ్యాప్తంగా ఉన్న రెండువేల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మెర్సీ అన్నది లేని మెర్స్‌ను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.