Begin typing your search above and press return to search.

ఫారిన్ చదువు: ఇండియన్స్ దే టాప్ ప్లేస్!

By:  Tupaki Desk   |   16 July 2015 7:12 AM GMT
ఫారిన్ చదువు: ఇండియన్స్ దే టాప్ ప్లేస్!
X
తమ పిల్లలు విదేశాల్లో పెద్ద పెద్ద చదువుకోవాలి.. దేశం దాటి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలి... అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల నుంచి డిగ్రీలు పొందాలి.. ఇదీ భారతీయ తల్లిదండ్రులకు అత్యంత గర్వకారణమైన అంశం. ఒకరిలో కాదు ఇద్దరిలో కాదు.. మెజారిటీ భారతీయ తల్లిదండ్రుల్లో ఈ భావన ఉంది. గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేస్తున్న దశ పిల్లలను కలిగిన వారిలో ఈ భావన తీవ్ర స్థాయిలో ఉంది. వీరంతా తమపిల్లలు విదేశాలకు వెళ్లి చదివితే చాలనే భావనలో ఉన్నారు. అందుకోసమే తెగ తపించిపోతున్నారు.

తాజాగా హెచ్ ఎస్ బీసీ సర్వేలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చింది. తమ పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని తపించే తల్లిదండ్రులు ఎక్కువమంది ఉన్న దేశం భారతదేశమే అని ఈసర్వే తేల్చింది. ఇక్కడ ఏకంగా 88 శాతం మంది పేరెంట్స్ తమపిల్లలను విదేశాల్లో చదివించడం పట్ల ఉత్సాహంతో ఉన్నారని ఈ సర్వే తేల్చింది. తమకు ఆర్థిక శక్తి ఉన్నా లేకపోయినా.. అవకాశం ఉంటే పిల్లను ఏ అమెరికాకో.. ఇంగ్లాండ్ కో.. కెనడాకో.. మరో అభివృద్ధి చెందిన దేశానికో చదువుల నిమిత్తం పంపించాలని భారతీయ తల్లిదండ్రుల తపన. ఈ తపన విషయంలో మనవాళ్లకు సాటి వచ్చేవారు ఈప్రపంచంలోనే లేరు!

ఈ విషయంలో భారతీయుల తర్వాతి స్థానంలో ఉన్నారు టర్కీవాళ్లు. 83 శాతం టర్కీ పేరెంట్స్ లో పిల్లలను విదేశాల్లో చదివించాలనే తపన ఉందట. ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు మలేషియన్లు. 83 శాతంలో మలేసియన్లుఉండగా.. 82 శాతం మంది చైనీయులు తమ పిల్లలను విదేశాల్లో చదివించాలనే తపనతో ఉన్నట్టుగా ఈ సర్వే తేల్చింది. విదేశీ చదవుల పట్ల క్రేజ్ ఎక్కువగాఉన్న దేశాల సంగతిలాఉంటే.. తక్కువ క్రేజ్ ఉన్న దేశాలు నిలిచాయి యూఏఈ, ఇండోనిసేయాలు. ఇక్కడ తమ పిల్లలను విదేశాల్లో చదివించాలనికోరుకొనే తల్లిదండ్రుల శాతం 30 చిల్లరలో ఉంది.