Begin typing your search above and press return to search.

అమెరికాను దున్నేస్తున్న భార‌తీయులు...

By:  Tupaki Desk   |   16 July 2015 7:28 AM GMT
అమెరికాను దున్నేస్తున్న భార‌తీయులు...
X
అమెరికా. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త‌కు ఆ దేశం అంటే ఎంతో క్రేజ్‌. ఆ గ‌డ్డ‌పై కొలువుదీరిన కంపెనీల్లో ఉద్యోగం చేయాల‌నేది యువ‌త‌కు ఉండే అత్యంత తీపికోరిక‌. అయితే భార‌త‌దేశ పారిశ్రామిక వేత్త‌లు ఇందుకు మించి మ‌రో అడుగు వేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వెళ్లి అక్క‌డ కొంత సొమ్ము స‌మ‌కూరిన త‌ర్వాత అక్క‌డే కంపెనీలు పెట్టి అమెరికాలో త‌మ ముద్ర‌ను వేసుకుంటున్నారు.

సీఐఐ, గ్రాంట్ థొర‌టాన్‌(జీటీ) సంస్థ‌లు విడుద‌ల చేసిన సంయుక్త నివేదిక‌లో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. భార‌తీయ వ్యాపార‌వేత్త‌లు దాదాపు 15000 బిలియ‌న్ డాల‌ర్లతో కంపెనీలు ఏర్పాటు చేశార‌ని ఆ నివేదిక‌లో తేలింది. ఈ కంపెనీల ద్వారా దాదాపు 91,000 ఉద్యోగ అవ‌కాశాల‌ను అమెరికా గ‌డ్డ‌పై సృష్టించారు. ఈ కంపెనీలు, ఉద్యోగాల క‌ల్ప‌న ద్వారా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థలో భార‌తీయులు సృష్టించిన సంపధ భారీ స్థాయిలో ఉంద‌ని లెక్క తేలింది. దీంతో పాటు అమెరికాలో ఉన్న 35 రాష్ర్టాల్లోనూ భార‌తీయ కంపెనీలు ఏర్పాటుచేశారు.

న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్షాస్‌, ఇలినాయిస్‌, న్యూయార్క్ వంటి ప్ర‌ఖ్యాత న‌గ‌రాల్లో భార‌తీయులు నేరుగా త‌మ కంపెనీల‌ను ప్రారంభించారు. దీంతో పాటు ఈ న‌గ‌రాల్లో భార‌తీయ కంపెనీల అధిప‌తుల ఎఫ్‌డీఐలతో భారీ స్థాయిలోనే ఆయా కంపెనీల‌ను స్థాపించాయ‌ని నివేదిక‌లో వివ‌రించారు.