గే లు అన్న ఒకే ఒక్క కారణంతో...

Fri Jul 24 2015 22:13:02 GMT+0530 (IST)

ఉగ్రవాదులు మనుషులేనా? మానవత్వపు చాయలు తగ్గితేనే ఉగ్రవాదులు అవుతారా? సున్నితత్వం మానవత్వం అనే అంశం పూర్తిగా కోల్పోయిన వారే ఉగ్రవాదులా? ఈమధ్య జరుగుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆటవిక దారుణాలు రాక్షసత్వపు క్రీడలు చూస్తుంటే ఇటువంటి సందేహాలు రాకమానవు! మోకాళ్లపై కూర్చొబెట్టి తలలు నరికేయడం కారులో కూర్చొపెట్టి పేల్చి చంపేయడం అవయువాలు కోసెయ్యడం ఇటువంటివి వారి ఆలోచనా విదానానికి మచ్చుతునకలు!

తాజాగా సిరియాలోనూ వారి రాక్షసత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది! స్వలింగ సంపర్కులు (గే) లు అన్న ఒకే ఒక్క కారణంతో ఇద్దరు యువకులపై ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు వారి రాక్షసత్వాన్ని మరోసారి బయటపెట్టారు. ఇద్దరినీ రాళ్లతో కొట్టి హింసించిన అనంతరం... ఆ యువకుల కళ్లకు గంతలు కట్టి ఒక ఎత్తైన భవనం పైనుంచి కిందికి తోసేశారు. కిందపడిన ఆ యువకుల మృతదేహాలు రక్తపుమడుగులో పడిఉన్నాయి! ముస్లింల పిల్లలు భయపడతారు హింసాత్మక వీడియోలు భయటపెట్టొద్దని ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ డిక్రీ జారీ చేసినా కూడా ఉగ్రవాదులు ఈ వీడియో విడుదలచేశారు!