శృంగారం చేయనన్నారని 19 మందిని చంపేశారు

Fri Aug 07 2015 22:40:17 GMT+0530 (IST)

మానవ రాక్షసులుగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మరోసారి తమ దుర్మార్గ వైఖరిని బయటపెట్టారు. మహిళల్ని ఆటబొమ్మల కంటే హీనంగా చూస్తే.. వారి చేత అత్యంత పాశవికంగా వ్యవహరించే వారు.. మరో ఆరాచకానికి పాల్పడ్డారు.

అమాయక మహిళల్ని కిడ్నాప్ చేసి.. వారి చేత బలవంతంగా శృంగారం చేసేలా బలవంతంగా చేయటం.. వారిపై లైంగిక దాడులు చేస్తుంటారు. వారి చేత బలవంతంగా పిల్లల్ని కనటం లాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి లైంగిక హింస తమ వల్ల కాదని.. శృంగారం చేసేందుకు నిరాకరించిన 19 మంది మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపేశారు.

ఆగస్టు 1.. 2 తేదీల్లో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రపంచాన్ని కదిలించేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలకు చెక్ చెప్పే శక్తి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.