Begin typing your search above and press return to search.

విశ్వరహస్యాలు ఇక చైనా చేతిలోనేనా?

By:  Tupaki Desk   |   26 July 2015 10:23 AM GMT
విశ్వరహస్యాలు ఇక చైనా చేతిలోనేనా?
X
విశ్వాంతర సమాచారాన్ని, రహస్యాలను చేధించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన సాధనం టేలీస్కోప్! ఊహలకు వాస్తవాలకూ మధ్య వారధిలా ఈ టెలీస్కోప్ పనిచేస్తుంది. అయితే ఈ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని తయారుచేయడం మొదలుపెట్టింది చైనా! ఈ కార్యక్రమం 2011లో ప్రారంభమై ఇప్పటివరకూ సాగుతూనే ఉంది! అయితే ఈ "ఫాస్ట్" టెలీస్కోప్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తికానున్నాయని చైనా చెబుతుంది! ఇప్పటికే దీని నిర్మాణానికి సంబందించిన పనులు అత్యంత భారీ ఎత్తున, అత్యంత ప్రతిష్టాత్మకంగా అతి జాగ్రత్తగా కొనసాగుతున్నాయి!

సుమారు 30 ఫుట్ బాల్ మైదానాలంత పెద్దజైలులో ఉండే ఈ టెలీస్కోప్ నిర్మాణం పూర్తయితే... భూమి పుట్టుక, గ్రహాంతర వాసులు, గ్రహాంతర జీవనం మొదలైన అంశాలపై విప్లవాత్మకమైన విషయాలు ప్రపంచానికి తెలియచెప్పే అవకాశం ఉంది. దీనికి "ఫాస్ట్" (ఫైవ్ హండ్రెడ్ మీటర్ అపెర్చర్ స్పెరిక రేడియో టెలీస్కోప్) అని నామకరణం చేశారు! ఈ టెలీస్కోప్ కంటే ముందు ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేటరీ... ప్రప్రంచంలోని అతిపెద్ద టెలీస్కోప్ గా 300 మీటర్ల వ్యాసంతో ఉండేది! అయితే ఈ ఫాస్ట్ ... 500 మీటర్లతో ఉండనుంది! ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీస్కోప్ ఏర్పాటు జరుగుతుంది! గుయోజౌ ప్రావిన్స్ లోని సహజసిద్ధంగా ఏర్పడిన ఒక అనువైన లోయలో దీని నిర్మాణం జరుగుతుంది! ఈ టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్లు!

చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ భారీ టెలీస్కోప్... విశ్వం నుంచి వచ్చే అర్థవంతమైన ధ్వనులను పసిగట్టడంలో దిట్టగా మారనుంది! ఇదే సమయంలో ప్రపంచంలోని సుదూర తీరాలనుంఛి వెలువడే రేడియో సంకేతాలను ఈ టేలీస్కోప్ కనిపెట్టగలుగుతుంది! ప్రపంచానికి అర్ధమయ్యీ అర్ధమవ్వని విషయంలో ఇప్పటికీ ఉహాలను అంచనాలకు భ్రమలకు మధ్య ఉన్న గ్రహాంతర జీవులు, వాటి పరిస్థితులు, గ్రహాంతర జీవనంపై కూడా ఈ టేలీస్కోప్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది.