Begin typing your search above and press return to search.

స్వచ్ఛ్ భారత్ కు సూపర్ ఐడియా

By:  Tupaki Desk   |   2 Aug 2015 11:33 AM GMT
స్వచ్ఛ్ భారత్ కు సూపర్ ఐడియా
X
గోడక్కొట్టిన బంతి అంటే తెలుసుకదా... గల్లీ క్రికెట్ కు ఫేమస్ అయిన ఇండియాలో ఈ విషయం తెలియనవారుండరు. గోడకు బంతికొడితే అది వెంటనే మళ్లీ మనపైకే వస్తుంది... ఇండియాలోని గల్లీల్లో గోడలను క్రికెట్ ఆడడానికే కాదు మూత్రం పోయడానికీ ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో మాత్రం ఇలా గోడ మీద మూత్రం పోస్తే భారీ ఎత్తున జరిమానా పడుతుంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ జాడ్యం ఉందట.. అక్కడ ఇలా గోడమీద పోస్తే 100 డాలర్ల వరకు జరిమానా వేస్తారు. అయినా కూడా ఆపుకోలేని పోయడం మాత్రం ఆపడం లేదట.. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి టెక్నాలజీని వాడుకున్నారు. అమెరికన్లు.

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కొ లో గోడలపై మూత్రం పోయకుండా సూపర్ టెక్నాలజీ వాడుతున్నారు. రోడ్లపైన, గోడలపైన మూత్రం పోసేవారిని మాన్పించడానికి కొత్తగా ఒక పెయింటింగ్ వేస్తున్నారు. ఈ పెయింటింగ్‌ స్పెషల్‌ ఏంటో తెలుసా. ఎవరైనా ఈ పెయింటింగ్‌ వేసిన గోడలపై పోసారా తిరిగి వాళ్లపైనే రివర్స్‌లో మూత్రం పడుతుంది. "అల్ట్రా వయలెట్‌ కోటెడ్‌ సూపర్‌ హైడ్రొఫోబిక్ పెయింట్‌" అని పిలుస్తున్న దీనికి అమెరికన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ టెక్నాలజీ కనుక ఇండియాలో ప్రవేశపెడితే అసలు స్వచ్ఛభారతే అవసరం లేదేమో.