వచ్చేసింది.. ఎతియోస్ ఎక్స్ క్లూజివ్

Tue Aug 11 2015 11:43:03 GMT+0530 (IST)

ఆటో మొబైల్ రంగంలోకి టయోటా దారి వేరు. నాణ్యత విషయంలో రాజీ పడని ఈ కంపెనీ ఉత్పత్తులు వినియోగదారుల్ని ఆకర్షిస్తుంటాయి. తాజాగా టయోటా కిర్లోస్కర్ మరో కొత్త కారును మార్కెట్లోకి తెచ్చింది.

తన వాహన శ్రేణిలో మాంచి పేరున్న ఎతియోస్ సిరీస్ లో ‘‘ఎతియోస్ ఎక్స్ క్లూజివ్’’ను తీసుకొచ్చింది. పెట్రోల్.. డీజిల్ రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన  ఈ కారును తాజాగా విడుదల చేశారు. బ్లూ.. మెటాలిక్.. సింఫనీ సిల్వర్.. పెరల్ వైట్ రంగుల్లో తీసుకొచ్చిన ఈ కారు ఆకర్షణీయంగా.. సౌకర్యవంతమైన సదుపాయాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు.

వినయోగదారుల అభిరుచులకు తగ్గట్లు తాజా ఎక్స్ క్లూజివ్ ను తీర్చిదిద్దినట్లుగా కంపెనీ చెబుతోంది. తమ కొత్త వేరియంట్ పై టయోటా నమ్మకంగా ఉంది. మార్కెట్లో అభిమానాన్ని సొంతం చేసుకోవటం ఖాయమని చెబుతున్నారు. పెట్రోల్ వెర్షన్ ను రూ.7.82 (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా.. డీజిల్ వేరియంట్ ను రూ.8.92 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం) గా నిర్ణయించారు. చూపురులను ఇట్టే ఆకట్టుకునేలా రూపొందించిన ఇతియోస్ ఎక్స్ క్లూజివ్ కు మార్కెట్ ఆదరణ ఎంత మేర ఉంటుందో చూడాలి.