Begin typing your search above and press return to search.

కొత్త టెక్నాలజీలతో కార్లు కొత్త పుంతలు

By:  Tupaki Desk   |   8 Jun 2015 7:52 AM GMT
కొత్త టెక్నాలజీలతో కార్లు కొత్త పుంతలు
X
ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది... కార్లు, బైకుల్లో రోజుకో కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. కొత్త సాంకేతికతలు కొత్తకొత్త సౌకర్యాలను తీసుకొస్తున్నాయి. డ్రమ్ బ్రేకుల స్థానంలో డిస్కు బ్రేకులు.... మోనోసస్పెన్షన్లు వంటివి బైకుల్లో ఇప్పటికే మనం ఉపయోగిస్తూ ఎంతో సౌకర్యం పొందుతున్నాం. ఇంకా కొత్త టెక్నాలజీలు కార్లలో అందుబాటులోకొస్తున్నాయి.. అలాంటివి కొన్ని...

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోలు అసిస్ట్:

క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటే కారు మనం ముందే నిర్దేశించిన వేగంతో వెళ్తుంది. కానీ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇంకా అడ్వాన్సుడుగా ఉంటుంది. మన కారు ముందున్న కారు వేగాన్ని బట్టి స్పందిస్తూ, వేగాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే, ముందున్న కారు వేగం తగ్గితే, మన కారు వేగం తగ్గటం.. ముందున్న కారు వేగం పెరిగితే మన కారు వేగం పెరగటం జరుగుతుంది. ఇలాంటి ఫీచర్ ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో బిందాస్ గా వెళ్లొచ్చు. ముందువెళ్లేవారు సడెన్ బ్రేక్ వేసినా మనతో సంబంధం లేకుండా మన కారు కూడా ఆగుతుంది.

అడాప్టివ్ హెడ్‌లైట్స్:

అడాప్టివ్ హెడ్‌‌లైట్స్ డ్రైవర్ కారును ఎటు తిప్పితే అటు తిరుగుతాయి. కారు ఎటు మలుపు తిప్పితే అటువైపు లైటింగ్ పడుతుంది. ఘాట్ రోడ్లు, గ్రామీణ మార్గాల్లో ఇది ఎంతో ఉపయోగకరం.

హెడ్స్అప్ డిస్‌ప్లే:

ఇది చాలా లేటెస్టు టెక్నాలజీ. కారు వెళ్తున్న వేగం, నావిగేషన్ తదితర వివరాలను ఇది నేరుగా విండ్‌షీల్డ్‌పై చూపిస్తుంది. దీనివల్ల డ్రైవరు పదేపదే డాష్ బోర్డు చూడాల్సిన అవసరం ఉండదు.


ఆటోమేటిక్ డిమ్మింగ్ మిర్రర్:


కారు లోపల మధ్యలో ఉండే ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వెనుకవైపు నుంచి వచ్చే వాహనాల హెడ్‌లైట్ల కాంతిని నేరుగా పడకుండా చేసి ఆటోమేటిక్‌గా డిమ్ అయ్యి, స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. కారు వెనుక కాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఇందులో బ్రైట్‌నెస్ అడ్జెస్ట్‌ అవుతుంది.


ఎలక్ట్రిక్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్:

కారులో తరచూ సీటును సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్స్ విత్ మెమరీ ఫంక్షన్ ఉంటే నచ్చినట్లుగా సీట్‌ను అడ్జస్టు చేసుకోగానే ఆ అడ్జస్ట్ మెంట్ మెమరీ బటన్‌లో స్టోర్ అవుతుంది. మీరు కారు సీట్లో కూర్చున్నప్పుడల్లా ఆ బటన్‌ను నొక్కగానే కారు మీరు ఇదివరకు సర్దుబాటు చేసుకున్న స్థానంలోకి మారిపోతుంది. అంటే... ఫోన్ లో ప్రొఫైల్ సెట్టింగ్స్ లాగే ఇది కూడా.

రోడ్డు సంకేతాల సమాచారం:

రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్, నో రైట్ టర్న్, డైవర్షన్ వంటివి ఒక్కోసారి చూడకుండా ప్రమాదాల బారిన పడతాం. కానీ ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ అనే కొత్త టెక్నాలజీ ఉంటే రోడ్డుకు చుట్టు ప్రక్కల ఉండే ఇలాంటి సంకేతాలను పరిశీలించి డ్రైవరును అప్రమత్తం చేస్తుంది.

పెడస్ట్రెయిన్, సైక్లిస్ట్ డిటెక్షన్:

రోడ్డుపై పాదచారులు, సైక్లిస్టులు వెళ్లడాన్ని గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు అప్లయ్ కావటం ఈ టెక్నాలజీ విశిష్టిత. కారులో ఉండే సెన్సార్లు ఈ పరిస్థితులను గమనించి, ఆన్ బోర్డ్ కంప్యూటర్‌కి సమాచారం అందజేస్తాయి. ఆ తర్వాత సదరు కంప్యూటర్ కారును తన కంట్రోల్‌లోకి తీసుకొని బ్రేక్స్ పడేలా చేస్తుంది.