ఎగిరేకారు వచ్చేస్తోంది!

Thu Jul 23 2015 12:11:30 GMT+0530 (IST)

భైరవదీపం సినిమాలో పడుకున్న మంచం గాళ్లొకి ఎగిరిపోయినట్ళు బాండ్ సినిమాల్లో కనిపించినట్లు... నలుగురు కూర్చున్న కారు గాల్లోకి ఎగిరిపోతే ఎలా ఉంటుంది! రోడ్డుమీద గాళ్లోనూ కూడా ప్రయాణిస్తే సూపర్ గా ఉంటుంది కదా! ప్రస్తుతం ఈ ఆలోచనకి ఒక రూపం తీసుకొచ్చారు! దీనికి టెర్రాఫ్యూజియా కారు అనే నామకరణం కూడా చేశారు! షార్ట్ కట్ లో టి.ఎఫ్. - ఎక్స్ (ట్F_X)! ఇది ఎగిరే పక్షిలా కనిపిస్తుంది కానీ... విమానం కాదు అలా అని సైజులో భారీగా కూడా ఉండదు .... మాములూ కార్లకంటే కాస్త ఎగస్ట్రా స్పేస్ తీసుకుంటుందంటే!

అయితే ఈ కారుని తయారుచేయడానికి సిద్దపడుతున్న పరిశోధకులు... అవసరమైనప్పుడు దానికదే మోటారు సాయంతో రెక్కలు ముడుచుకోవడం తెరుచుకోవడం జరిగేలా చూస్తున్నారు. దీనివల్ల ఇంటి కార్ సెడ్డులో కూడా దీన్ని భద్రపరచుకోవచ్చు! ఈ కారు డిజైన్ పూర్తిగా పూర్తయితే గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారుచేస్తున్నారట! నేల మీద నడిచే సమయంలో కూడా 300 హార్స్ పవర్ ఇంజిన్ తో పనిచేస్తుందట. అన్నీ అనుకూలంగా జరిగి ఈ ఫ్లైయింగ్ కారు మార్కెట్ లో అందుబాటులోకి రావాలంటే మాత్రం కనీసం 8 - 12 ఏళ్లు పడతాయని చెబుతున్నారు!

గాల్లో నిలువుగా అడ్డంగా ప్రయాణించగల్గే టెర్రాఫ్యూజియా... కారులోని కంప్యూటర్ స్క్రీన్ మీద వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని టైపు చేస్తే చాలు సురక్షితంగా అక్కడకు చేరుస్తుంది! ఈ టెర్రాఫ్యూజియా కారులో నలుగురు ప్రాణించే అవకాశాలు ఉన్నాయి! ఈ కారుకు సంబందించిన మరిన్ని సాధ్యసాధ్యాలకు సంబందించిన పరిశొధనలు మాసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.ఐ.టి)లో జరుగుతున్నాయ్!