ఆన్ లైన్లోనూ రాయలే; అదరగొట్టేస్తున్న ఎన్ ఫీల్డ్

Thu Jul 16 2015 09:56:12 GMT+0530 (IST)

గజరాజు మాదిరి.. రోడ్డు మీద హుందాగా దూసుకెళ్లటానికి రాయల్ ఎన్ ఫీల్డ్ కి మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. అప్పుడెప్పుడో డెబ్భైల్లోనూ.. ఎనబైల్లోనూ ఒక ఊపు ఊపేసిన రాయల్ ఎన్ ఫీల్డ్.. ఈ డిజిటల్ కాలంలో కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. ఈ వాహనాల్ని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

అందుబాటులోకి ఎన్ని ద్విచక్రవాహనాలు వచ్చినప్పటికీ.. రాయల్ ఎన్ ఫీల్డ్ సోయగం ముందు మిగిలినవి బలాదూరే. రాయల్ ఎన్ ఫీల్డ్ లను తయారు చేసే ఐచర్ సంస్థ.. తాజాగా ఒక లిమిటెడ్ ఎడిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ యుద్ధాల్లో వినియోగించిన డిస్పాచ్ రైడర్స్ ఆదర్శనంగా తీసుకొని ఒక లిమిటెడ్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. వీటి అమ్మకాల్ని ఆన్ లైన్లో మాత్రమే అమ్ముతున్నారు.

స్టోర్.రాయల్ ఎన్ ఫీల్డ్. కామ్ లో మేలో అమ్మిన లిమిటెడ్ ఎడిషన్ డిస్పాచ్ మోటార్ సైకిళ్లను అన్ లైన్ లో అమ్మినప్పుడు కేవలం 26 నిమిషాల్లోనే 200 బైకులు అమ్మటం విశేషం. అలా అని ఈ బైకు ధర తక్కువగా ఉంటుందని భావిస్తే పొరపడినట్లే. ఆన్ లైన్ లో మాత్రమే అమ్మిన ఈ బైకు విలువ ఆన్ రోడ్ రూ.2.16లక్షలు.  రోడ్డు మీదనే కాదు.. ఆన్ లైన్ అమ్మకాల్లోనూ ఎన్ ఫీల్డ్ రాయల్ అనిపించుకున్నట్లుంది కదూ.