కొత్త పల్సర్ కేక..

Mon Jun 29 2015 15:37:45 GMT+0530 (IST)

బజాజ్ కంపెనీకి సూపర్ మోడల్ బైక్ పల్సర్ లో కొత్త వేరియంట్ వచ్చింది. పల్సర్ ఆర్ఎస్200గా పిలుస్తున్న ఇది యువతను ఆకట్టుకుంటోంది. ఏబీఎస్ బ్రేకింగ్ వ్యవస్థ లేని మోడల్ ధరను 118500 (ఎక్స్ షోరూమ్ముంబై) గాను ఏబీఎస్ పరికరం ఉన్న మోడల్ ధరను 130268(ఎక్స్-షోరూమ్ ముంబై) గా నిర్ణయించారు.

పల్సర్ ఆర్ఎస్200 లో ఉపయోగించి ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆప్షన్ కు మంచి గిరాకీ  ఉంది. ఎక్కువ పీడనం పడే ముందు చక్రానికి ఏబీఎస్ వ్యవస్థను అమర్చారు. ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా బాష్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది. బైకు నడిపేటప్పడు ఏ స్థాయిలోనూ కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు ఈ ఏబీఎస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలా వాహనాలకు ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ పల్సర్ ఆర్ ఎస్ 200 లో ఉపయోగిస్తున్నది సింగిల్ ఛానల్ ఏబీఎస్ కావడం విశేషం.