ఇండియాలో వోల్వో నాలుగో మోడల్

Mon Jun 29 2015 15:34:45 GMT+0530 (IST)

    స్వీడన్ సంస్థ అయిన వోల్వో తన కొత్త వేరియంట్ వోల్వో ఎస్60 టీ6 ను జులై 3న ఇండియాలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. భారత్ లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన వోల్వో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్త మోడళ్లతో సిద్ధమవుతోంది.

వోల్వో ఎస్60 టీ6 ఫీచర్స్ ఇవీ..

- ఇంజన్ : 2.0లీ 4-సిలిండర్ పెట్రోల్ టర్బో చార్జెడ్. హార్స్ పవర్ : 304 టార్క్ : 399.91 ఎన్ఎమ్. గేర్ బాక్స్ : 8-స్పీడ్ ఆటోమేటిక్.

- ప్రస్తుతం వోల్వో ఇండియా భారత్ లో వి40 క్రాస్ కంట్రీ ఎక్స్.సీ90 మరియు వి40 హ్యాచ్ బ్యాక్ అనే మూడు మోడళ్లను విడుదలచేసింది. ఎస్60 టీ6  నాలుగో మోడల్.

ప్రస్తుతం ఇండియాలో తయారీ యూనిట్ లేకపోవడంతో వోల్వో కార్లన్నీ విదేశాల నుంచే దిగుమతవుతున్నాయి. వోల్వో రెండు మూడేళ్లలో ఇండియాలో తయారీ యూనిట్లను స్థాపించే యోచనలో ఉంది.