కస్టమర్లు కోరుకున్నట్లుగా బెంజ్ కార్లు

Fri Jul 31 2015 10:28:17 GMT+0530 (IST)

విలాస కార్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మెర్సిడెస్ బెంజ్ మరింత దూకుడు పెంచింది. దేశంలో పెరుగుతున్న సంపన్నుల అవసరాలకు తగినట్లుగా అత్యంత విలాసవంతమైన కార్ల శ్రేణిని అందుబాటులోకి తీసుకురావాలన్న వ్యూహంలో భాగంగా.. సరికొత్త శ్రేణిని తాజాగా స్టార్ట్ చేసింది.తాజాగా సంపన్నుల కోసం మూడు కార్లను దేశీయంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. విలాసవంతమైన కార్లనుకొనుగోలు చేయటంలో భారతీయుల్లో పెరుగుతున్న ఆసక్తిని గుర్తించిన ఈ జర్మన్ కంపెనీ.. అందుకు తగ్గట్లుగానే తాజా మూడు కార్లను మార్కెట్ లోకి తెచ్చింది. ఈ వాహనాల విలువ రూ.2కోట్లు నుంచి రూ.2.6కోట్ల వరకు ఉండనున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కార్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

తాజాగా విడుదల చేసిన మూడు మోడళ్లను.. ఏడాదికి వంద కార్లను అమ్మాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కస్టమర్లు కోరుకున్న విధంగా.. వారి వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్లుగా కస్టమైజ్ డిజైనర్ కార్లను కూడా తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. చేతిలో డబ్బులు ఉండాలే కానీ.. కోరుకున్న కారును రెఢీ చేయటానికి బెంజ్ కూడా రెఢీ అవుతోంది. పైసలున్న పెద్ద మనషులు మరెన్ని చిత్రవిచిత్రమైన కార్లను రోడ్ల మీదకు తీసుకొస్తారో..?