మార్కెట్ క్రాస్ రోడ్ లోకి మారుతి ఎస్ క్రాస్

Thu Aug 06 2015 10:30:57 GMT+0530 (IST)

భారతీయులకు కార్ల యజమానులయ్యే అవకాశాన్ని కల్పించటమేకాదు.. చిన్నకార్లలో తనకు తిరుగులేదన్న విషయాన్ని పదే పదే చాటి చెప్పే మారుతి సుజుకి.. ఈ మధ్య కాలంలో పెద్ద కార్లపై  దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఖరీదైన కార్లను వరుసగా విడుదల చేస్తూ.. ఆ విపణిలోనూ తన సత్తా చాటాలని తహతహలాడుతున్న మారుతి.. తాజాగా మరోకొత్త కారును మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

‘‘ఎస్ క్రాస్’’ విడుదల చేసిన ఈ కారు డీజిల్ ఇంజిన్ తో మాత్రమే లభిస్తోంది. 1.6 లీటరు.. 1.3 లీటరు ఇంధన సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు ధరలు వరుసగా.. రూ.8.34 నుంచి రూ.10.75 లక్షలు.. రూ.11.09లక్షల నుంచి రూ.13.74 లక్షల మధ్య లభిస్తున్నాయి. ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూంకి చెందినవి.

ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన హుందయ్ క్రెటా.. రెనో డస్టర్ లకు మారుతి ఎస్ క్రాస్ పోటీ ఇవ్వనుంది. బుధవారం మార్కెట్ లోకి విడుదలైన ఈ కొత్త కారు మార్కెట్లోకి వచ్చేశాయని.. రోడ్ల మీదకు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మారుతి చెబుతోంది. సమర్థంగా పని చేయటంతో పాటు.. ఆకర్షనీయంగా.. సౌకర్యవంతంగా.. ఉండాలని కోరుకునే వారికి చక్కటి సమాధానంగా మారుతి ఎస్ క్రాస్ ఉంటుందని చెబుతున్నారు.