తిరుపతిలో ఒక వినూత్నమైన కోర్సు

Thu Jul 16 2015 12:51:29 GMT+0530 (IST)

తిరుపతిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ఐటీఐ)లో ప్రత్యేక స్కిల్ సెంటర్ ఏర్పాటు గురించి అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో పేరెన్నిక గన్న ఇసూజు మిత్సుబిషి వంటి సంస్థలు తిరుపతి ఐటీఐ అటోమొబైల్ టెక్నాలజీ స్కిల్ సెంటర్(ఏటీఎస్ సీ) లో భాగస్వామ్యులు అవుతున్నాయి. ఆటోమొబైల్ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు... ఈ రంగంలో కృషి చేయాలనే భావనతో ఉన్న యువతకు ఈ ఏటీఎస్ సీ ఒక చక్కటి వేదిక అయ్యే అవకాశాలున్నాయి.

అంతర్జాతీయ స్థాయి.. బాగా పేరున్న సంస్థల భాగస్వామ్యం ఇక్కడి ఏటీఎస్ సీ ని ఉన్నత శ్రేణికి తీసుకెళ్లవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాల్ యోజన ఫ్లాగిషిప్ ప్రోగ్రామ్ కింద తిరుపతి ఐటీఐలో ఈ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ సెంటర్.. ఆలోమొబైల్ రంగం పైఉత్సాహంతో ఉన్నవారికి. ఈ రంగంలోని నిపుణత్వాన్ని సాధించాలనుకొంటున్న యువతకు ఉత్తమ స్థాయి నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికే గాక.. వారికీ ఆటోమొబైల్ రంగ పరిశ్రమకు వారధిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పేరున్న సంస్థలే కాకుండా.. మానవ వనరుల అభివృద్ధిలో కూడా ఇసూజు వంటి సంస్థలకు మన్నన ఉంది. ఇలాంటిసంస్థల సహకారంతో తిరుపతి ఐటీఐ అత్యుత్తమస్థాయి విద్యాసంస్థ అయ్యే అవకాశం ఉంది. ఐటీఐకి అందిస్తున్న సహకారాన్ని ధ్రువీకరించిన ఇసూజు ప్రతినిధులు త్వరలోనే శ్రీసిటీసెజ్ లో వాహనాల ప్రొడక్షన్ యూనిట్ మొదలవుతుందన్నారు. భారతదేశంలోనే ఉత్తమ వెహికల్ ప్రొడ్యూసర్ గానిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.