ఆ ఐదు కార్లు 5 లక్షల కంటే తక్కువే..

Mon Jun 29 2015 15:23:30 GMT+0530 (IST)

భారతదేశ నగరాలకు కరెక్టుగా సూటయ్యే కార్లవి... సౌకర్యాల విషయంలో ఎకకడా రాజీ ఉండదు... మైలేజి విషయంలో నో టెన్షన్.. స్టైలుకు స్టైలు.. కంఫర్టుగా కూడా ఉంటాయి. సైజు కూడా పెద్దగా ఉండకపోవడంతో పార్కింగ్ సమస్యా తక్కువే. ఇక ధర విషయానికొస్తే రూ.5 లక్షలకు మించవు. మరి అలాంటి అయిదు కార్ల గురించి తెలుసుకుందామా..!!

హ్యుండాయ్ ఐ10 : హ్యుండాయ్ ఐ10 బేసిక్ మోడల్ షోరూం ధర రూ.4.02 లక్షలు ఇది లీటరుకు కనీసం 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ చైల్డ్ సేఫ్టీ లాక్ సెంట్రల్ లాకింగ్ వంటి లేటెస్టు అంశాలన్నీ ఉన్నాయి. 8 బీహెచ్పీ గల 4 సిలిండర్ 1.1 లీటర్ ఐఆర్.డీఈ2 పెట్రోల్ ఇంజన్ తో పనిచే్స్తుంది.


మారుతీ సుజుకీ సెలారియో : మారుతీ సుజుకీ సెలారియో ప్రారంభ ధర రూ.4.03 లక్షలు  మైలేజి లీటరుకు 20 కిలోమీటర్లపైనేనని చెబుతుంటారు. పవర్ స్టీరింగ్ చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఏ.ఎమ్.టీ వెర్షన్ రూ.4.54 లక్షలకు దొరుకుతుంది. 67 బీహెచ్పీ.. 1000 సీసీ ఇంజిన్.


హోండా బ్రియో : దీని ప్రారంభ ధర రూ.4.33 లక్షలు.. స్టైల్ విషయంలో మిగతావాటికంటే భిన్నమైనది. 18 కి.మీ/లీ మైలేజ్. పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. 7 బీహెచ్పీ.. 1200 సీసీ ఇంజిన్.

నిస్సాన్ మైక్రా యాక్టివ్ : ప్రారంభ ధర రూ.4.46 లక్షలు. 19.4 కి.మీ/లీ మైలేజ్ .. ఐ10 బ్రియోలో ఉన్న ఫీచర్సన్నీ ఇందులో ఉన్నాయి. 67 బీహెచ్పీ... 1200 సీసీ ఇంజిన్ ఉంది.

డాట్సన్ గో : ప్రారంభ ధర రూ.3.12లక్షలు.. ఇందులో అత్యధిక ధర ఉన్న మోడల్ లైన్ వెర్షన్ మోడల్. దీని ధర రూ.3.69లక్షలు (బెంగళూరు షోరూం ధర). ఇది 20.63 కి.మీ/లీ మైలేజ్ ను ఇస్తుంది. 67 బీహెచ్పీ 1200 సీసీ ఇంజిన్ ఉంది.