మార్కెట్లో ‘‘క్రెటా’’ క్రేజ్

Wed Jul 22 2015 10:28:01 GMT+0530 (IST)

కొన్ని ఉత్పత్తులు మార్కెట్ లోకి రాక ముందు ఆసక్తిని రేకెతిస్తుంటాయి. సదరు ఉత్పత్తులు ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వస్తాయా? అని ఎదురుచూసేలా చేయటమే కాదు.. వచ్చిన వెంటనే వాటి కోసం ఎగబడుతుంటారు. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల విషయంలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుంటుంది.

కానీ.. కార్ల మార్కెట్ అందుకు భిన్నం. కొత్త వెర్షన్ మార్కెట్ లోకి వచ్చిన వెంటనే సక్సెస్ కావటం కాస్త తక్కువే. విడుదల సమయంలోనే టాక్ ఆఫ్ ద మార్కెట్ గా మారి.. అందరి దృష్టిని ఆకర్షించిన కారు.. హ్యుందాయ్ క్రెటా.

ఐదు సీట్లున్న ఈ కారు మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మకాలు ఎక్కువగా ఉన్న స్పోర్ట్స్ యూలిటిలీ విభాగంలో అడుగు పెట్టిన హ్యుందాయ్ క్రెటాతో మార్కెట్ లోకి అడుగుపెట్టింది. స్టైలీష్ లుక్ తో పాటు.. సాంకేతికంగా కాంబినేషన్ బాగుందన్న మాటతో క్రెటాకు క్రేజ్ వచ్చేసింది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన క్రెటా ఎంట్రీ లెవెల్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.8.59లక్షలు నుంచి రూ.11.19లక్షల మధ్య ఉంది.

ఇక డీజిల్ వేరియంట్ లో 1.6లీటర్ల ఇంజిన్ ఎంటీ లెవెల్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.11.59లక్షల నుంచి రూ.13.57 లక్షలుగా ఉంది. రెనో డస్టర్.. ఫోర్డ్ ఎకో స్పోర్ట్.. నిస్సాన్ టెరానో.. మహీంద్రా స్కార్పియో.. ఎక్స్ యూవీ 500.. టాటా సఫారీ స్మార్ట్ లతో క్రెటా మార్కెట్ లో ముఖాముఖిన ఢీ కొననుంది.