ఒక్క రోజు.. 14 దేశాల్లో కార్లు బంద్..?

Fri Jul 24 2015 09:49:02 GMT+0530 (IST)

ఏదైనా అంశంపై వినూత్నంగా కార్యక్రమం నిర్వహించాలంటే మిగిలిన దేశాల సంగతేమో కానీ.. యూరోపియన్ దేశాల తర్వాతే. తాజాగా 14 యూరోపియన్ దేశాలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యూరోపియన్ దేశాలు ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

మిగిలిన దేశాలకు స్ఫూర్తినిచ్చేలా ఒక రోజున దేశంలోని ఎవరూ కార్లు వినియోగించకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ మొబిలిటీ వీక్ కార్యక్రమంలో భాగంగా 246 నగరాలు.. పట్టణాల్లో సెప్టెంబర్ లోని ఒక రోజు కార్లు వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఒక్కరోజు ఆయా నగరాలు.. పట్టణాల్లోని ప్రజలంతా కార్ల బదులుగా.. ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం యూరోపియన్ దేశాల్లో మాదిరే.. ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ స్ఫూర్తి పొందితే బాగుంటుంది.