సెలబ్రిటీ ల్లో ఎవరెవరు ఏ కార్లు వాడుతున్నారంటే...!

Fri Jul 17 2015 12:47:12 GMT+0530 (IST)

కావాల్సినంత డబ్బు ఉంటే.. ఎక్కడా రాజీపడనక్కర్లేదు. .మరి అలాంటి పరిస్థితుల మధ్యనే విభిన్న రుచులను ఆస్వాధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్న స్వతంత్రం వారిలోని అభిరుచిని చాటే అవకాశం ఉంది. అధునాతన సౌకర్యాలను అందుకొనే శక్తి ఉన్నవారి ఎంపిక వారి వ్యక్తిత్వానికి ప్రతిబింబం అవుతుంది. మరి సినిమా వాళ్లలో స్టార్ స్టేటస్ లో ఉన్నవారికి ఈ అవకాశాలు అన్నీ ఉంటాయి. మరి అలాంటప్పుడు వారి ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం. ప్రత్యేకించి స్టేటస్ సింబల్ అయిన కార్ల విషయంలో సెలబ్రిటీల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మరి అలాంటివారిలో ఎవరెవరు ఏకారును వాడుతున్నారో చూద్దామా..!

సల్మాన్ ఖాన్: అధునాతన కార్లలో కొన్ని రకాలను తొలిసారి డ్రైవ్ చేసిన భారతీయుడిగా నిలుస్తాడు సల్మాన్. కొత్త మోడల్స్.. ఖరీదైన మోడల్స్ విషయంలో ఎనలేని ఆసక్తిని ప్రదర్శించే సల్లూ దగ్గర ఇప్పుడు ఆడి ఫోర్ డోర్ ఆర్ఎస్ ౭ కారు వినియోగిస్తున్నాడు. ఇలాంటి కారును కొనగల శక్తి తక్కువమందికే ఉంటుంది మనదేశంలో.

షారూక్: సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే అయినా.. ఇప్పుడు తన స్థాయికి తగ్గట్టుగా విలాసవంతమైన కార్లను కొనేయడం షారూక్ అలవాటు. షారూక్ దగ్గర జర్మన్ లగ్జరీ కార్లు ఉన్నాయి. తను వ్యక్తిగతంగా వాడేది అయితే బెంట్టే కాంటినెంటల్ జిటి. తెల్లగా సౌమ్యంగా.. విలాసవంతానికి నిదర్శనంగా ఉండే ఈ కారుతో పాటు మరిన్ని లగ్జరీ కార్లు కూడా షారూక్ కాంపౌండ్ లో ఉన్నాయి.

సంజయ్ దత్ః ప్రస్తుతానికి ఈ కండల హీరో జైల్లో ఉన్నాడు. ఇతడికి ఇష్టమైన విలాసవంతమైన కార్లు ఇంటి కాంపౌండ్ కే పరిమితం అయ్యాయి. అయినా వాటి ఠీవీ ఏ మాత్రం తగ్గలేదు.. వాటి స్థాయి అలాంటిది మరి. దత్ వద్ద ఐదారు ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి విలువ కనీసం అన్నా ఇరవై కోట్ల రూపాయల వరకూ చేస్తుందని ఒక అంచనా. ఫెరారి 599 జిటిబి బెంట్లె కాంటినెంటల్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆడి ఏ ఎయిట్ వంటి కార్లు దత్ కాంపౌండ్ లో కొలువై ఉన్నాయి.

ప్రియాంకచోప్రా: ఆడవాళ్లకు వాహనాల మీద కంటే నగల మీదే మోజు ఎక్కువ అనుకొంటాం. అయితే ప్రియాంకను చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే.. ఆమె దగ్గర ఖరీదైన కార్ల కలెక్షనే ఉంది. విదేశాలకు వెళితే అక్కడ ఆమె తప్పుకుండా కార్ల షోరూమ్ లను సందర్శిస్తుంది. తన మనసును దోచుకొనే కార్లను కొనేయడానికి వెనుకాడదు. ప్రస్తుతానికి అయితే తన దగ్గర బీఎండబ్ల్యూ 7 సీరిస్ మెర్సిడేజ్ ఇ-క్లాస్ రోల్స్ రాయిస్ హోర్లే డేవిడ్సన్ పింక్.. వంటి కార్లున్నాయి.

రణ్ బీర్ కపూర్: ఈ తరం బాలీవుడ్ హీరోల్లో స్టార్ స్టేటస్ కు రీచ్ అయిన హీరో రణ్ బీర్. మరి కార్ల ఎంపికలో కూడా ఈ యువకుడు దూకుడుగా ముందుకు సాగుతున్నాడు. ఆడీ ఏ8 ఆడీ ఆర్ 8 వంటి కార్లను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాడు. ఇంకా.. మెర్సిడేజ్ జీ 63 సువ్ రేంజ్ రోవర్ వంటి కార్లలను కూడా వాడుతున్నాడు ఈ స్టార్ హీరో.