Begin typing your search above and press return to search.

బుకింగ్స్ ఓపెన్; ‘‘మినీ కంట్రీమ్యాన్’’ వచ్చేసింది

By:  Tupaki Desk   |   6 Aug 2015 11:36 AM GMT
బుకింగ్స్ ఓపెన్; ‘‘మినీ కంట్రీమ్యాన్’’ వచ్చేసింది
X
విలాసవంతమైన కార్లకు కేరాఫ్ అడ్రస్ అ​​యిన బీఎండబ్ల్యూ తాజాగా మరో కారును దేశంలోకి అందుబాటులోకి తెచ్చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ మినీకి తోడుగా.. ‘‘మినీ కంట్రీమ్యాన్’’ అప్ గ్రేడ్ వెర్షన్ ను భారతదేశ విపణిలోకి తీసుకొచ్చారు.

మినీ సీరిస్ శ్రేణిలో ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా తాజాగా.. మినీ కంట్రీమ్యాన్ రంగంలోకి దించేశారు. భద్రతకు పెద్ద పీట వేసిన కంట్రీ మ్యాన్ లో ఆరు ఎయిర్ బ్యాగ్ లు.. డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్.. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం.. బ్రేక్ అస్టిన్.. రన్ ప్లాట్ ఇండికేటర్ లాంటివి పొందుపర్చారు.

ఇప్పటికే ఉన్న మినీ కంట్రీమ్యాన్ కు మరిన్ని హంగులు అద్ది విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.36.5లక్షలుగా చెబుతున్నారు. తాజాగా ఇంటీరియర్.. ఎక్స్ టీరియర్ కు సరికొత్త హంగులు దిద్ది మార్కెట్ లోకి వదిలారు. మరి.. మినీ కంట్రీమ్యాన్ కంట్రీమ్యాన్ల మనసుల్ని ఎంతగా దోచుకుంటుందో చూడాలి.