ఆటో ఎక్స్ పో వచ్చేస్తోంది...

Wed Jul 08 2015 13:26:37 GMT+0530 (IST)

భారత్ లో రెండేళ్లకోసారి నిర్వహించే ఆటో ఎక్స్ పో కోసం అంతా సిద్ధమవుతోంది. 2016 ఆటో ఎక్స్‌ఫో తేదీలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో 2016 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను 2016 ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు. ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌ఫో మార్ట్ మరియు సెంటర్‌లో ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను ప్రగతి మైదాన్‌లోను నిర్వహించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 2014లోను ఇవే ప్రాంతాల్లో ఆటో ఎక్స్‌ఫోను నిర్వహించారు.

    గతసారి నిర్వహించిన ఆటో ప్రదర్శనల్లో భారత్ తరఫున 44 ఆవిష్కరణలు ప్రదర్శించగా 26 మోడళ్లు లాంచ్ చేశారు. సుమారు రోజుకు 100000 మంది ప్రేక్షకులు ఈ ఆటో ఎక్స్‌ఫోకు వస్తారు. 2014 ఆటో ఎక్స్‌ఫోలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు 300 వాహనాలను డిస్ల్పేలో ఉంచారు. వీటితో పాటు 20 ద్వి-చక్రవాహనాలను కూడా డిస్ల్పేలో కనిపించేలా ఏర్పాటుచేశారు.

    మరో ఏడు నెలల్లో నిర్వహించబోయే ఈ భారీ ఈవెంట్ కోసం ఢిల్లీలో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలవుతుండగా ఆటోమొబైల్ సంస్థలు కూడా ప్రపంచానికి కొత్త మోడళ్లు ఉత్పత్తులు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇందుకు గాను ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మార్కెట్ ను అందుకోవాలంటే ప్రచారం కూడా అవసరమని... అందుకు ఇలాంటి షోలు తోడ్పడతాయని ఆటో దిగ్జజాలు చెబుతున్నారు.