మేకిన్ ఇండియా; మహీంద్రా హెలికాఫ్టర్లు..!

Sat Jul 04 2015 15:33:14 GMT+0530 (IST)

ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మేకిన్ ఇండియా నినాదం పెద్ద పెద్ద కలల్ని సైతం ఇట్టే సాకారం చేసే దిశగా పయనిస్తున్నాయి. హెలికాఫ్టర్లు లాంటి భారీ వాహనాల్ని మేడిన్ ఇండియా సాధ్యమయ్యే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇండియన్ ఆర్మీకి అవసరమయ్యే హెలికాఫ్టర్ల తయారీ కోసం ప్రముఖ భారతీయ కంపెనీ మహీంద్రా.. యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్‌లు చేతులు కలపటం పలువురిని ఆకర్షిస్తోంది. వీరి జాయింట్ వెంచర్‌లో మేకిన్ ఇండియాలో భాగంగా.. హెలికాఫ్టర్లు తయారు చేసే ఆలోచనలో వీరు ఉన్నారు. దీనికి సంబంధించిన చర్చలు త్వరలో జరపనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొనటం చూస్తుంటే.. ఈ వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందన్న వాదన వినిపిస్తోంది.

ఈ భాగస్వామ్యం వర్క్‌వుట్ అయితే.. పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు.. మేడిన్ ఇండియా పేరును హెలికాఫ్టర్ల మీద కూడా చూసుకునే అవకాశం కలుగుతుంది. సగటు భారతీయుడికి అంతకు మించిన గర్వకారణం ఏం ఉంటుంది.