Begin typing your search above and press return to search.

కేజ్రివాల్ నివాసంలో ఏం జరిగింది ?

ఆప్ ఎంపీ స్వాతి మాలిన్యాలు పై సీఎం కేజ్రివాల్ నివాసంలో దాడి జరిగింది అని గత కొన్ని రోజులుగా వార్త చక్కర్లు కొడుతుంది

By:  Tupaki Desk   |   17 May 2024 2:20 PM GMT
కేజ్రివాల్ నివాసంలో ఏం జరిగింది ?
X

ఆప్ ఎంపీ స్వాతి మాలిన్యాలు పై సీఎం కేజ్రివాల్ నివాసంలో దాడి జరిగింది అని గత కొన్ని రోజులుగా వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటనపై అరవింద్ కేజ్రివాల్ స్పందించలేదన్న చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ ఈ మేరకు కేజ్రివాల్ స్పందనపై ప్రశ్నించారు.

ఈ దాడిపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఆప్ స్వాతి మాలివాల్‌పై దాడి జరిగినట్టుగా చెబుతున్న రోజున కేజ్రీవాల్‌ నివాసంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నది. ఆ వీడియోలో కేజ్రీవాల్‌ భద్రతా సిబ్బందిని స్వాతి మాలివాల్‌ బూతు పదజాలంతో దూషించడం, ‘గంజా సాలా’ అని వ్యాఖ్యానించడం కనిపించింది. ఈ క్లిప్పింగ్‌నే ఆప్ తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తూ.. ‘స్వాతి మాలివాల్‌ కా సచ్‌’ అనే క్యాప్షన్‌ తో పోస్ట్ చేసింది.

మే 13న ఈ ఘటన జరుగగా ఆప్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. స్వాతిమాలివాల్‌ కేజ్రివాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి తనపై దాడి చేశాడని మాలివాల్‌ పోలిసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.