Begin typing your search above and press return to search.

విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఈ వయసులో కూడా రేవంత్ చలాకీతనం చూసి విద్యార్థులు పరేషాన్ అయ్యారు.

By:  Tupaki Desk   |   12 May 2024 6:41 AM GMT
విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
X

సార్వత్రిక సంరంభం మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోరాడాయి. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో శక్తి వంచన లేకుండా పోరాడాయి. ఇక విజయమే మిగిలి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. విజయం తమదంటే తమదనే వాదనలో ఉన్నాయి.

ఇన్నాళ్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 54 ఏళ్ల వయసులో పార్టీ కోసం తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను కోరారు. మైకులు, సభలు, రోడ్ షోలతో హోరెత్తించిన రేవంత్ ప్రస్తుతం రిలాక్స్ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఈ వయసులో కూడా రేవంత్ చలాకీతనం చూసి విద్యార్థులు పరేషాన్ అయ్యారు. ఆయన ఆట తీరుకు ముగ్దులయ్యారు. కుర్రాడిలో మైదానంలో కదులుతుంటే ఆసక్తిగా చూశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కోసం అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. సిబ్బంది కూడా చేరుకున్నారు. ఎన్నికల సామగ్రి కూడా పంపిణీ పూర్తయింది. బూత్ ల వారీగా మెటీరియల్ అందజేశారు. సాయంత్రం లోగా పోలింగ్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని సిబ్బందికి అధికారులు సూచించారు. రేపు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ మొదలు కానుంది.

ఓటర్లు కూడా వారి సొంత ఊళ్లకు బయలుదేరారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వెళ్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాలు బిజీగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా జనసందోహమే కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్ లు వేధిస్తున్నాయి. ఓటు వేయాలనే ఉద్దేశంతోనే అందరు తమ ఊళ్లకు పయనం అవుతున్నారు.

జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ రోజు తెలిసిపోతుంది. రెండు పార్టీలు నువ్వా నేనా అనే ధోరణిలో ప్రచారం చేసుకున్నాయి. ఇక విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే మరి. బీజేపీ, కాంగ్రెస్ లు తమ బలాబలాలు ప్రదర్శించాలని ఉత్సాహంగా ఉన్నాయని తెలుస్తోంది.