Begin typing your search above and press return to search.

రాహుల్ ను ర్యాగింగ్ చేస్తున్న చెస్ దిగ్గజం !

దీనిపై బీజేపీ బాగ్ రాహుల్ బాగ్ అంటుంటే అమేథీలో రాహుల్ ను ఓడించిన స్మృతిఇరాని గాంధీ కుటుంబాన్ని తరిమికొట్టానని చెబుతున్నది.

By:  Tupaki Desk   |   4 May 2024 4:30 PM GMT
రాహుల్ ను ర్యాగింగ్ చేస్తున్న చెస్ దిగ్గజం !
X

అసలే మూలిగే నక్క దానిపై తాటిపండు పడినట్లుంది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యవహారం. గతంలో యూపీలోని అమేథీలో ఓడిపోయి కేరళలోని వయనాడ్ లో గెలిచాడు. ఈసారి వయనాడ్ లో పోటీ చేసి ఎన్నికలు అయిపోయాక తిరిగి అమేథీలో పోటీ చేస్తాడు అనుకుంటే రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతున్నాడు.దీనిపై బీజేపీ బాగ్ రాహుల్ బాగ్ అంటుంటే అమేథీలో రాహుల్ ను ఓడించిన స్మృతిఇరాని గాంధీ కుటుంబాన్ని తరిమికొట్టానని చెబుతున్నది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గురించి చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘‘ముందు రాయ్ బరేలీలో గెలువు’’ అని చేసిన కామెంట్ దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న రాహుల్ తన ఫోన్ లో చెస్ ఆడాడు. ఈ సంధర్భంగా రాహుల్ తన అభిమాన చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ అని, రాజకీయాలకు, చెస్ కు దగ్గరి సంబంధాలున్నాయని రాహుల్ పేర్కొన్నాడు.

దాని మీద స్పందించిన ఓ నెటిజన్ చెస్ దిగ్గజాలు కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్ త్వరగా ఆట నుండి రిటైర్ అయ్యారని, వారికి మన కాలం గొప్ప మేధావితో తలపడే అవకాశం రాలేదని వ్యంగ్యంగా విమర్శించాడు. ఈ నేపథ్యంలో స్పందించిన క్యాస్పరోవ్ తాను వ్యంగ్యంగా చేసి వ్యాఖ్య ఇలా చర్చకు దారితీస్తుందని ఆలోచించలేదని అన్నాడు.

రష్యాకు చెందిన కాస్పరోవ్ కొన్నేల్ల క్రితం క్రొయేషియా పారిపోయి తలదాచుకుంటున్నాడు. ఆయన తరచుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాలను తప్పుపడుతుంటాడు. 61 ఏళ్ల కాస్పరోవ్ 2005 లోనే చదరంగం ఆటకు వీడ్కోలు పలకడం గమనార్హం.