Begin typing your search above and press return to search.

రగులుతున్న మాచర్ల.. రెండు కార్లు ధ్వంసం

ఓటర్లు అంతా పార్టీల వారీగా చీలిపోవటం.. తాము వ్యతిరేకించే పార్టీల వారిని తమ వ్యక్తిగత శత్రువులుగా భావించే తీరు ఈ ఎన్నికల సందర్భంగా కొందరిలో కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   13 May 2024 5:29 AM GMT
రగులుతున్న మాచర్ల.. రెండు కార్లు ధ్వంసం
X

ఏపీ రాజకీయాలకు ఈసారి ఎన్నికలు ల్యాండ్ మార్క్ గా మారనున్నాయి. భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి చోటు చేసుకునే పరిణామాలన్ని కూడా ఈసారి ఎన్నికల రిఫరెన్సు ఉంటుందని చెప్పక తప్పదు. రాజకీయం వ్యక్తిగతంగా మారటం మొదలై కొంతకాలం గడిచినా.. ఈసారి ఎన్నికల్లో అది కాస్తా పీక్స్ కు చేరటం కనిపిస్తోంది. రాజకీయాల కారణంగా ఎన్నోకుటుంబాల్లోనూ.. స్నేహితుల మధ్య దూరం పెరిగిన దుస్థితి. తెలంగాణలో లేని ఈ పోకడ ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఓటర్లు అంతా పార్టీల వారీగా చీలిపోవటం.. తాము వ్యతిరేకించే పార్టీల వారిని తమ వ్యక్తిగత శత్రువులుగా భావించే తీరు ఈ ఎన్నికల సందర్భంగా కొందరిలో కనిపిస్తోంది.

ఇలాంటి తీరు కొన్ని నియోజకవర్గాల్లో మరింత ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తోంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఈ కోవలోకే వస్తుందని చెప్పాలి. ఎన్నికల వేళ మాచర్ల ఉడికిపోతోంది. అధికార.. విపక్షాలకు చెందిన నేతలు.. కార్యకర్తలు.. మద్దతుదారులు నిలువునా చీలిపోవటమే కాదు.. పోలింగ్ వేళ అధిక్యత కోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా మాచర్ల నేతలు వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్ని అధికార.. విపక్ష నేతలు సీరియస్ గా తీసుకోవటమే కాదు.. పర్సనల్ గా భావిస్తున్నారు. దీంతో.. చిన్న పరిణామం సైతం పెద్ద ఇష్యూగా మారుతోంది. ఇందుకు తగ్గట్లే ఆదివారం చోటు చేసుకున్న ఒక పరిణామం షాకిచ్చేలా మారింది. సోమవారం జరిగే అసెంబ్లీ.. ఎంపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫు ఏజెంట్లుగా కూర్చోవద్దంటూ వైసీపీ శ్రేణులు హుకుం జారీ చేశారు.

ఇందులో భాగంగా టీడీపీకి చెందిన మల్లయ్య యాదవ్. . సిద్దయ్యలను ఫోన్ ద్వారా వార్నింగ్ ఇవ్వటం.. దీనిపై స్పందించిన వారు వెంటనే పార్టీ నేతలకు సమాచారం అందించారు. దీనికి స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ మద్దతుదారు ఇంటికి వెళ్లి కర్రలతో దాడి చేశారు.అక్కడే ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. దీంతో.. నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కింది. తమపై దాడికి పాల్పడతారా? అంటూ అధికార పక్ష నేతలు రగిలిపోతున్నారు. సకాలంలో వచ్చిన పోలీసులు అక్కడి పరిస్థితిని సద్దుమణిగేలా చేసినా.. పరిస్థితి మాత్రం రగులుతున్న అగ్నిపర్వతం మాదిరి మారిందంటున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల తరహా రాజకీయాలు నెలకొన్న నియోజకవర్గాల మీద పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.