Begin typing your search above and press return to search.

పల్నాడులో గాల్లోకి కాల్పులు.. అనిల్ కుమార్ మాస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2024 10:56 AM GMT
పల్నాడులో గాల్లోకి కాల్పులు.. అనిల్  కుమార్  మాస్  వార్నింగ్!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం 7 గంటల నుంచి సుమారు సాయంత్రం వరకూ అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది! ఈ సందర్భంగా... నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారని చెబుతున్నారు.

ఈ క్రమంలో... సోమవారం అర్ధరాత్రి వరకు తీవ్ర ఘర్షణ చోటు చేసుకోగా.. పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి! ఈ సమయంలో ప్రధానంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేషుని పాడులో అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు!

అవును... సోమవారం జరిగిన పోలింగ్ లో వైసీపీకి ఓటు వేశారనే కారణంతో పలువురు బీసీల ఇళ్లపైన పడి కొంతమంది దుండగులు దాడులు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... సుమారు మూడు గంటల పాటు ఏకదాటిగా రాళ్లు విసురుతూ.. కర్రలతో ఇళ్లపై దాడికి దిగారని అంటున్నారు. ఈ క్రమంలో.. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడి చేయబోయారని చెబుతున్నారు.

ఇదే సమయంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలకు చెందిన వారి ఇళ్లను రౌడీ మూకలు కూల్చేశాయని చెబుతున్నారు. దీంతో ఆ దాడి నుంచి తప్పించుకున్న మహిళలు, పిల్లలు స్థానికంగా ఉన్న గంగమ్మ గుడిలో రాత్రంతా తలదాచుకున్నారు! ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావు పేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారిపోయింది. రెచ్చిపోయిన రౌడీ మూకలు వీరి కాన్వాయ్ పై రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ సమయంలో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు! ఈ పరిస్థితుల్లో... పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఏ క్షణం ఏం జరుగుద్దోనని కొత్త గణేషునిపాడులో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు!

అనిల్ కుమార్ సీరియస్ వార్నింగ్!:

ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, గంగమ్మ గుడిలో దాక్కొన్న మహిళలకు ధైర్యం చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. సుమారు 200 మంది దుండగులు వైసీపీకి మద్దతుగా ఉన్నారనే కారణంతో దాడులకు తెగబడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుని ముసలినక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ప్రతాపం చూపించాలనుకుంటే... తాము సిద్ధమని, కొన్ని రోజుల్లో అన్నీ తేలుస్తామని స్పష్టం చేశారు!

ఇది గనుక మళ్లీ రిపీట్ అయితే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఆ పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని.. అందుకు సిద్ధమైతే సిద్ధమే అని క్లారిటీ ఇచ్చారు!!